ఇలా చేస్తే వైరస్ అసలు ఉండదట..!  

warangal, nit professor, antiviral device, goods, Warangal Professor Anti viral device - Telugu Antiviral Device, Goods, Nit Professor, Warangal, Warangal Professor Anti Viral Device

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బయటకు వస్తే చాలు వైరస్ ఏ రూపంలో మన వద్దకు చేరుతుందో తెలియడం లేదు.

 Warangal Nit Professor Developed Antiviral Device On Goods

ఈ కరోనా కారణంగా నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్న భయపడిపోతున్నారు ప్రజలు.

పండ్లు, పాలు, నిత్యావసరాలు, డెలివరీ ప్యాకింగ్‌లు ఇలా ఏవి తీసుకోవాలన్న కరోనా వ్యాప్తికి బయపడి ఆందోళన చెందుతున్నారు.

ఇలా చేస్తే వైరస్ అసలు ఉండదట..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ ఆందోళన పోగొట్టడం కోసమే `నిట్‌ అధ్యాపకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు.నిట్‌లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ దినకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీ హరినాథ్‌లు కలిసి ఓజోనిట్‌ పేరుతో ఫ్రిజ్‌ వంటి స్టెరిలైజేషన్‌ మెషిన్ ని తయారు చేశారు.

ఇంకా ఈ మెషిన్ లో నిత్యావసరాలతో పాటు ఇతరత్రా సరుకులను ఫ్రిడ్జ్‌ వంటి ఈ పరికరంలో ఉంచితే వైరస్ అంతం అవుతుందని అంటున్నారు నిట్ అధ్యాపకులు.ఈ మెషిన్ లో ఏ సరుకులు అయినా 20 నుంచి 25 నిమిషాల వరకు పెట్టి ఓజోన్‌ వాయువులో ఉంచడం వల్ల వస్తువులకు ఉన్న అన్ని రకాలైన వైరస్‌లు 99.99 శాతం తొలిగిపోతాయని ప్రొఫెసర్ తెలిపారు.
కరోనా నుండి కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు, దుస్తులు, డెలివరీ ప్యాకింగ్‌లు ఇలా అన్నింటిని ఈ మెషిన్ ద్వారా వైరస్ రహితంగా మార్చుకోవచ్చట.

ఇంకా ఈ మెషిన్ ని త్వరలోనే పూర్తిస్థాయిలో రూపొందించి మార్కెట్లోకి తీసుకొస్తామని వారు తెలిపారు.

#Warangal #Goods #Nit Professor

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Warangal Nit Professor Developed Antiviral Device On Goods Related Telugu News,Photos/Pics,Images..