తల్లి అంత్యక్రియలకు అని బయలుదేరితే,మృత్యువు కబళించింది  

Road Accident In Warangal While Going To Mother Cremation - Telugu Mother Cremation, Telugu Viral News Updates, Viral In Social Media, Warangal, తల్లి అంత్యక్రియలకు

తల్లి అంత్యక్రియలకు అని కొడుకు, కోడలు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం రూపంలో మృతువు వారిని కబళించింది.ఈ దారుణ ఘటన తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లో చోటుచేసుకుంది.

Road Accident In Warangal While Going To Mother Cremation - Telugu Mother Cremation, Telugu Viral News Updates, Viral In Social Media, Warangal, తల్లి అంత్యక్రియలకు-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే…వరంగల్ జిల్లా లోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం లో దంపతులు మృతి చెందారు.

ఆదిలాబాదు లోని తన తల్లి రమణమ్మ శనివారం అనారోగ్యం తో కన్నుమూసింది.అయితే ఆమె అంత్యక్రియల నిమిత్తం కుమారుడు,కోడలు బయలుదేరి కారులో వెళుతుండగా మార్గ మధ్యలో లారీ ఢీ కొనడం తో ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు.

అయితే మృతులు రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్, అతని భార్య సునీత ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.దీనితో ఆదివారం తల్లికి జరగాల్సిన అంత్యక్రియలు ఆపేయాల్సి వచ్చింది.

మరోపక్క దంపతుల పోస్ట్ మార్టం అయ్యాక ముగ్గురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తుంది.పాపం తల్లి అంత్యక్రియలకు అని వెళుతుండగా కొడుకు,కోడలు ఇలా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం తో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

తాజా వార్తలు

Road Accident In Warangal While Going To Mother Cremation-telugu Viral News Updates,viral In Social Media,warangal,తల్లి అంత్యక్రియలకు Related....