టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో మొద‌లైన కంగారు.. అందుకేనట.. ?

తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్‌ఎస్ పార్టీకి ప్రస్తుతం గడ్డురోజులు వస్తున్నట్లుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ప్రజల్లో ఈ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైనట్లుగా కనిపిస్తుంది.

 Warangal Corporation Elections Warangal, Corporation Elections, Survey, Negative-TeluguStop.com

అదీగాక దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఈ పార్టీ మీద జనానికి ఏపాటి నమ్మకం ఉందో అర్ధం అయ్యింది.అంతే కాకుండా త్వరలో జరగనున్న వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కారు పార్టీ వేసుకున్న లెక్కలు తారుమార‌వుతున్నట్లు స‌మాచారం.

ఇక ఈ పార్టీకి చాలా చోట్ల రెబ‌ల్స్‌, విప‌క్షాల అభ్య‌ర్థుల నుంచి గ‌ట్టి పోటీ నెల‌కొని ఉండగా, తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని 50 డివిజ‌న్ల‌లో 40 స్థానాల్లో అధికార పార్టీ గ‌ట్టి పోటీని ఎదుర్కొనబోతున్న విషయం స‌ర్వేలో బయట పడిందట.అందుకే పైకి మేక‌పోతు గాంభీర్యం ప్రద‌ర్శిస్తున్నా లోన మాత్రం ఏం జ‌రుగుతుందోన‌ని వ‌ణికిపోతున్నట్లుగా సమాచారం.

అందుకే టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో కంగారు మొద‌లైందంట‌.అంతే కాకుండా ఇక్కడి నేతలు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది.

అందుకే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube