కృష్ణా జ‌లాల‌పై జ‌గ‌న్‌తో ఇక యుద్ధ‌మే.. కొత్త ప్రాజెక్టుల‌కు కేసీఆర్ ప్లాన్!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఉమ్మ‌డి రాష్ట్రం నుంచే కృష్ణా జ‌ల‌లాపై వివాదాలు న‌డుస్తున్నాయి.రెండు ప్రాంతాల‌కు వాటాల విష‌యంలో అప్ప‌టి నుంచే గొడ‌వ‌లు వ‌స్తున్నాయి.

 War With Jagannath On Krishna Waters Kcr Plan For New Projects-TeluguStop.com

ఇక తెలంగాణ ఏర్ప‌డ్డాక ఈ వివాదం తారా స్థాయికి చేరింద‌నే చెప్పాలి.కానీ జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఈ వివాదం కొంత త‌గ్గింది.

ఇరు రాష్ట్రాల సీఎంలు వీటిపై చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం చూపాల‌ని భావించారు.కానీ ఏపీ ఎప్పుడైతే కృష్ణా జ‌ల‌లాల‌పై క‌ట్ట‌డాల‌కు పూనుకుందో అప్ప‌టి నుంచి వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

 War With Jagannath On Krishna Waters Kcr Plan For New Projects-కృష్ణా జ‌లాల‌పై జ‌గ‌న్‌తో ఇక యుద్ధ‌మే.. కొత్త ప్రాజెక్టుల‌కు కేసీఆర్ ప్లాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడున్న కృష్ణ బేసిన్ నీళ్ల మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై న్యాయ‌పోరాటం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం డిసైడ్ అయింది.ఈ మేర‌కు ధ‌ర్మాస్థానంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై పోరాటం చేయాల‌ని, వారి దోపిడీని ఎత్తి చూపాలని నిన్న సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇదే క్ర‌మంలో తెలంగాణ‌కు వాటాగా రావాల్సిన నీళ్ల‌కోసం ఏపీకి ధీటుగా కృష్ణ న‌దిపై కొత్త కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.ఇప్ప‌టికే ఉన్న జోగులాంబ బ్యారేజీ పేరుమీదద‌నే వ‌న‌ప‌ర్తి జిల్లాకు ప‌రివాహ‌కంలో అలంపూర్ ద‌గ్గ‌ర కృష్ణా న‌దిపై నూత‌నంగా బ్యారేజీని క‌ట్టాల‌ని దీని ద్వారా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు నీటిని అందించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.ఇందుకోసం టెండ‌ర్లు పిల‌వాల‌ని కేబినెట్ డిసైడ్ అయింది.ఈ కొత్త ప్రాజెక్టు నుంచి దాదాపుగా 60నుంచి 70 టీఎంసీల వరదనీటిని ఏదుల రిజర్వాయర్ కు త‌రలించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది.

అయితే ఈ కొత్త ప్రాజెక్టుల‌పై ఏపీ ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెప్పే ఆస్కారం ఉంది.దాంతో ఈ జ‌ల వివాదం యుద్ధంలా మారే ప్ర‌మాదం కూడా ఉంది.మొత్తానికి కేసీఆర్ ఇక జ‌గ‌న్‌తో జ‌ల యుద్ధం చేయ‌డానికి రెడీ అయ్యాడ‌న్న మాట‌.

#@CM_KCR #Alampur #Krishna River #Telengana #Andhra CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు