“ఒక్క సీటు” కోసం “నలుగురు” కుమ్ములాట...“చంద్రబాబు” తీర్పు చెప్పవయ్యా

ఏ పోరు ఉన్న పరవాలేదు కానీ ఇంటిపోరు మాత్రం ఉండకూడదు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.అనుభం నేర్పిన పాటాలే.

 War In Tdp For Anakapalli Mla Ticket-TeluguStop.com

పద్యాలుగా.సూక్తులుగా వచ్చాయన్న విషయం మర్చిపోకూడదు సుమీ.

సరే అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడికి నిత్యం ఎదో ఒక వ్యవహారం, సమస్యలు ,పనులు ఎదో ఒక విషయంలో సతమతమావుతూనే ఉంటారు.అడుగు తీసి అడుగు పెడితే సమస్యల సుడిగుండాలే.

ఒక పక్క వైసీపి వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ.ప్రభుత్వం పనితీరుని పర్యవేక్షిస్తూ ఒకటి కాదు రెండు కాదు గంపెడు సమస్యలని చూసుకునే బాబు కి ఇప్పుడు ఇంటి పోరు అతిపెద్ద సమస్యగా మారింది.

విశాఖపట్నం జిల్లా లోని అనకాపల్లి అంటే టీడీపికి కి కంచుకోట అయితే గత ఎన్నికల్లో అక్కడి నుంచీ పోటీ చేసిన ఎమ్మెల్యే పీలా గోవింద్‌ కి ప్రజలు తిరుగులేని గెలుపుని అందించారు అందుకు తగ్గట్టుగానే ఆయన అనియోజక వర్గ అభివృద్ధి కి ఎంతో కృషిచేస్తూ వచ్చారు.అయితే వచ్చే ఎన్నికల్లో సైతం అక్కడ టీడీపీ నే గెలుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచీ నేను పోటీ చేస్తాను అంటే నేను చేస్తాను అంటూ మరో ఇద్దరు నేతలు ముందుకు వచ్చారు.దాంతో పీలా గోవింద్‌ ఈ సారి కూడా నాకు ఇదే నియోజక వర్గం కావాలి నేను ఎంతో అభివృద్ధి చేసుకున్నాను అంటూ పట్టు బట్టారు.అయితే

అనకాపల్లి సీటుకోసం ఇప్పుడు అంతగా పట్టు బడుతున్న మరో ఇద్దరు నేతలు ఎవరంటే.

ఒకరు.విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరొకరు.

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌…అయితే 2009లో అనకాపల్లి నుంచి తాను విజయం సాధించాను కానీ అనుకోని పరిస్థితుల్లో 2014లో భీమునిపట్నంలో పోటీ చేయాల్సి వచ్చింది.ఈసారి అనకాపల్లి నుంచే.

పోటీ చేయాలనుకుంటున్నానని గంటా తెగేసి చెప్తున్నారట.

అప్పట్లో ‘చంద్రబాబు’ కోరికపై అనకాపల్లి ఎంపీగా పోటీ చేశాను.

ఇప్పుడు నాకు అక్కడి అసెంబ్లీ సీటు కావాలి అంటూ పట్టు పడుతున్నారు ఎంపీ అవంతి.ఈ మూడు ముక్కల్లో ఏ ముక్కకుపోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో కానీ.

వారు పరస్పరం పోటీపడి.ఆరోపణలు చేసుకుంటున్నారు.

మాజీమంత్రి దాడి వీరభద్రరావు తనకు అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే.తాను టిడిపిలో చేరతానని పెద్ద బాంబు పేల్చడంతో ఇప్పుడు అనకాపల్లి రాజకీయం రసకంధం లో పడింది.

ఇప్పటికీ ఆ సీటు కోసం ముగ్గురు కొట్టుకుంటుంటే మరొకడి రూపంలో దాడి రావడం జగన్ పార్టీ నుంచీ వచ్చినా అసలు మూలాలు మాత్రం తెలుగుదేశానివే అంతేకాదు దాడికి అనకాపల్లి లో బలగం కూడా ఎక్కువగానే ఉండటడం.ఈ సారి టిక్కెట్టు తనకి కాకుండా తన కుమారుడికి ఇవ్వమని చెప్పడంతో చంద్రబాబు కూడా దాడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube