విశాఖ వార్ తేల్చింది ఏంటి ? వైసీపీ టీడీపీ ఏం చెప్పాలనుకుంటున్నాయ్ ?

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ కు వచ్చిన చంద్రబాబు అడుగడుగున నిరసనల స్వాగతం పలికాయి.చంద్రబాబు యాత్రను ముందుకు వెళ్లకుండా ప్రజలు, వైసీపీ నాయకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

 War Between Ycp And Tdp Over Visakha-TeluguStop.com

అయితే విశాఖ వార్ లో ఎవరు క్రెడిట్ కొట్టారు అనే అంశం తెరమీదకు వస్తోంది.వైసిపి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పై నిరసనలు తెలియజేసేందుకు విశాఖకు వచ్చిన జగన్ కు ఇప్పుడు చంద్రబాబు తరహాలోనే అవమానాలు ఎదుర్కొన్నారు.

ఆయన ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎయిర్ పోర్ట్ లోనే నిరసన తెలిపారు.చంద్రబాబుకు దాదాపు అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

అమరావతి రాజధానిగా ఉంచాలని చంద్రబాబు నేతృత్వంలో ఇప్పటికీ ఆందోళన కొనసాగుతున్నాయి.అదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనను బాబు వ్యతిరేకిస్తున్నారు.

విశాఖను రాజధానిగా ఒప్పుకోం అమరావతి తప్ప అంటూ చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో సాధారణంగా ఈ ప్రాంతంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అదే విశాఖలో ఇప్పుడు బాబు అడుగుపెట్టడంతో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యాయి.

ఇప్పటికే టిడిపి ప్రజాప్రతినిధులు విశాఖను రాజధానిగా ఒప్పుకుంటూ అనేక సార్లు మీడియా ముందు కూడా మాట్లాడారు.టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం విశాఖను రాజధానిగా మద్దతు ప్రకటించారు.

ఇప్పుడు చంద్రబాబు విశాఖకు వ్యతిరేకం అంటూ అదే ప్రాంతంలో అడుగు పెట్టడం తో టిడిపి ప్రజాప్రతినిధులు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.వాస్తవంగా మూడు రాజధానిలో ప్రతిపాదనలతో మూడు ప్రాంతాలు మూడు రకాలుగా స్పందిస్తున్నాయి.

గుంటూరు, కృష్ణ లో చంద్రబాబుకు మద్దతు వస్తున్నా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఈ విషయాలను పక్కన పెడితే అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, అలాగే విశాఖలో చంద్రబాబు దిగ్బంధనం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే విషయం అర్ధం అవుతోంది.

విశాఖను రాజధానిగా వ్యతిరేకించినందుకే అక్కడి ప్రజలు చంద్రబాబును తిప్పి పంపారని ప్రజా ఆగ్రహంతో చంద్రబాబు వెనకడుగు వేశారని వైసిపి ప్రచారం చేస్తోంది.అయితే టిడిపి మాత్రం చంద్రబాబు ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని చెబుతోంది.

ఒక ప్రతిపక్ష నాయకుడు పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని, పోలీసులతో రాజ్యం నడిపిస్తున్నారని టిడిపి వాదిస్తోంది.ఇక వైసీపీ మాత్రం ఈ వ్యవహారంలో మాకు సంబంధం లేదని, ఇదంతా చంద్రబాబు స్వయంకృపరాధం అంటూ చెబుతూ అప్పట్లో తమ నాయకుడు జగన్ ను మీరు ఇంతకన్నా ఇబ్బంది పెట్టారు కదా అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube