కేసీఆర్ ని ఢీ కొట్టేందుకు రాములమ్మ రె"ఢీ"     2017-10-14   01:02:17  IST  Bhanu C

విజయశాంతి..ఒకప్పటి టాప్ హీరోయిన్..సినీరంగానికి దూరమవుతున్న సమయంలో తెలంగాణా రాష్ర్టం కోసం ‘తల్లి తెలంగాణ’ పార్టీ పెట్టింది విజయశాంతి..ఆతరువాత కేసీఆర్ విజయశాంతిని ఒప్పించి టీఆర్ ఎస్ లో చేర్పించడమే కాకుండా…పార్టీని విలీనం చేయించారు. అప్పట్లో కేసీఆర్ కి విజయశాంతి అత్యంత సన్నిహితంగానే ఉన్నారు..

అయితే కేసీఆర్ వ్యవహారశైలి వల్ల 2014 సాధారణ ఎన్నికలకు ముందు విజయశాంతి టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయశాంతి పాలిటిక్స్ లో ఎక్కడా ఆక్టీవ్ గా కనిపించలేదు..కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు

రాహుల్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్న తరుణంలో మళ్ళీ విజయశాంతి పాలిటిక్స్ లో ఆక్టీవ్ కానున్నారు అని తెలుస్తోంది రాహుల్ గాంధీ రాములమ్మను తన కోర్ టీంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ కు – టీఆర్ ఎస్ పార్టీకి ధీటుగా పని చేస్తారన్న విశ్వాసంతో విజయశాంతికి కాంగ్రెస్ ప్రాముఖ్యతను ఇవ్వనుందని తెలుస్తోంది..

అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను – నెరవేర్చని హామీలను – మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు. ఆమెకు ప్రచార బాధ్యతలు,అప్పగించనున్నారని అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కేసీఆర్ కి ధీటుగా రాములమ్మని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని టాక్..

అయితే రాములమ్మపై కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకం..ఫలిస్తుందా లేక కేసీఆర్..ధాటికి రాములమ్మ నిలబడగలదా లేదా అనేది వేచిచూడాల్సిందే