ఆదిలోనే హంసపాదు..పవనూ ఇదేమీ షాకు నీకు       2018-06-27   23:35:01  IST  Bhanu C

జనసేన పార్టీ..ఈ పార్టీ పుట్టుక కూడా చాలా మంది ఏపీ ప్రజలకి తెలియదు..ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే జనం నుంచీ పుట్టాలి కానీ పవన్ పార్టీ ఎంతో వెరైటీ గా అజెండా లేకుండా అవసరానికి పుట్టింది అన్నట్టుగా ఉంటుంది గత ఎన్నికల్లో చంద్రబాబు అవసరం కోసం పవన్ కళ్యాణ్ వచ్చాడు అనే ముద్ర పడితే ఈ ఎన్నికల్లో జగన్ కోసం జనసేన అన్నట్టుగా ముద్ర పడుతూ వచ్చింది..ఇంకా పార్టీలో సరిగా నిర్మాణం కూడా జరగలేదు..పార్టీ లో ఎవరెవరు ఉంటున్నారు విధివిధానాలు కూడా తెలియనే లేదు అప్పుడే పార్టీలో ముసలం లావాలా తన్నుకు వస్తోంది..

అయితే ఇప్పటికే ఎన్నో చోట్ల పార్టీలో అభిమానులు పార్టీ నేతలమధ్య విభేదాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతూనే వచ్చాయి చిత్తూరు జిల్లా లో ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు పార్టీ మీటింగ్ లలో కొట్టుకుంటూనే ఉన్నారు.. అయితే ఇదే నేపథ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి భారీ షాక్ త‌గిలింది…అయితే అలాంటిలాంటి షాక్ కాదు దిమ్మతిరిగి మైండ్ బ్లాకు అయ్యేలాంటి షాక్..అదేంటంటే..తూగో జిల్లాలో త్వరలో అడుగుపెట్టబోతున్న జనసేనుడి కి ఆ జిల్లా నుంచీ గట్టి షాక్ తగిలింది..కాకినాడ న‌గ‌రంలోమాజీ టీడీపీ అధ్య‌క్షుడు నున్న దొర‌బాబు జ‌న‌సేన‌ను వీడి టీడీపీలో చేరుతున్నారు.

ఈ ఘటన పవన్ పార్టీలో నూతన శోభ వస్తున్న సమయంలో కోలుకోలేని దెబ్బకొట్టింది పార్టీ మారిన నున్న దొరబాబు అతో పాటుగా ప‌లువురు నేత‌లు జ‌న‌సేన‌లో చేరారు, పవన్ యాత్రలో నిజం లేదు అంతా కూడా జగన్ కి తోడూ నీడలా సాగుతోందా అనేట్టుగా మారడంతో మళ్ళీ టీడీపి లోకి వెళ్ళడానికి సర్వం సిద్దం చేసుకున్నారు…అయితే రెండు నెల‌ల క్రితం ఆయ‌న స్వయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లిశారు. ఆ త‌ర్వాత ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. జ‌న‌సేన త‌రపున సేవా కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. కానీ అంత‌లోనే మ‌ళ్లీ టీడీపీ నుంచి ఆఫ‌ర్ రావ‌డంతో ఆయ‌న వెన‌క్కి తగ్గారని తెలుస్తోంది..

గతంలో టీడీపీ అధ్యక్షుడిగా దొరబాబు వ్యవహరించారు..అప్పట్లో ఎమ్మెల్యే కొండ‌బాబుకి మ‌ధ్య వైరం ముదిరింది. దాంతో ఎమ్మెల్యే దొర‌బాబుని ప‌ద‌వి నుంచి తొల‌గించారు. దాంతో ఆగ్ర‌హించిన నున్న దొర‌బాబు టీడీపీకి దూరంగా ఉంటూ, జ‌న‌సేన‌లో చేరారు.. మేయ‌ర్ భ‌ర్త ప్ర‌స్తుతం న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న్ని ప‌ద‌వి నుంచి తొల‌గించేందుకు,తెదేపా లోకి వస్తా అని ఫీలర్లు పంపుతున్న నున్న దొర‌బాబుకి మరోసారి టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు. దాంతో పోయిన ప‌ద‌వి మ‌ళ్లీ ద‌క్క‌డానికి మార్గం సుగ‌మం కావ‌డంతో నున్న దొర‌బాబు మ‌రోసారి సైకిలెక్కేందుకు సిద్ధ‌మ‌య్యారని తెలుస్తోంది..ఆ దొరబాబు సైకిల్ ఎక్కడం మాట పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేనలో మొదటి సారిగా పార్టీ నుంచీ వేరొక పార్టీలోకి జంప్ అయిన సంఘటన జరగడంతో జనసేన వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి..మరి పవన్ ఈ జంపింగ్ ఎపిసోడ్ పై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి .