కోతితో ఫొటో దిగాలనుకుంది.. కానీ ఆ షాక్ ఊహించలేదు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..!

కోతులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.ఈ అల్లరి కోతులు ఒక్కోసారి దాడి చేస్తే.

 Wanted To Take A Photo With The Monkey . But The Shock Was Unexpected Laughing-TeluguStop.com

ఒక్కోసారి ఏమీ హాని తలపెట్టకుండా వాటి మానాన అవి వెళ్ళిపోతుంటాయి.దీంతో వాటి ప్రవర్తనను అంచనా వేయడం చాలా కష్టం.

ఆహారం అందించడానికి ప్రయత్నించినా అవి ఒక్కోసారి దాడికి దిగుతుంటాయి.అందుకే వీటితో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.

వాటికి విసుగు తెప్పిస్తే.అందుకు మూల్యం చెల్లించక తప్పదు.

ఈ విషయం తెలీక తాజాగా ఒక యువతి భారీ షాక్ తింది.కోతితో సెల్ఫీ అంటూ పెద్ద రిస్కే చేసింది.

అయితే ఆ కోతి ఆకస్మాత్తుగా దాడి చేయడంతో తప్పించుకోలేక ఆ యువతి ఉక్కిరిబిక్కిరి అయ్యింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఈ వీడియో లో ఏముందో తెలుసుకుంటే ఓ యువతి ఒకజూ కి వెళ్ళింది.అక్కడే ఓ చెట్టుకు గొలుసుతో కట్టేసి ఉన్న కోతి కనిపించింది.ఆ కోతి ని చూసి ముచ్చట పడిన యువతి దానితో ఫొటో దిగాలనుకుంది.ఆ కోతికి దగ్గరగా వెళ్లి అలా నిలుచున్నప్పుడు ఓ ఫొటో తియ్యమని తన స్నేహితురాలిని కోరింది.

అదే సమయంలో కోతి చాలా కోపంగా చూసింది ఓవైపు గొలుసుతో బంధీ అయి నేనుంటే నీకు ఫొటో కావాల్సి వచ్చింద అని ఆ కోతి ఆగ్రహంతో ఊగిపోయింది.ఆ తరువాత ఒక్కసారిగా యువతి ముఖంపైకి దూకింది.

ఆమె మొహాన్ని గట్టిగా పట్టుకొని గీరడం ప్రారంభించింది.అది జట్టు కూడా పట్టుకోవడంతో యువతి తప్పించుకోవడానికి తల్లడిల్లింది.

కళ్లు, ముక్కును జుట్టు లాగేసి యువతికి భారీ షాక్ ఇచ్చింది.

అయితే ఆ సమయంలో యువతి తన తల చుట్టూ స్కార్ఫ్ ధరించి ఉంది.దీనివల్ల ఆమె మొహానికి పెద్దగా గాయాలేవీ కాలేదు.ఓ ఇన్‌స్టాగ్రామ్‌లోని అకౌంట్‌లో షేర్ చేసిన ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై నెటిజన్లు. మంచి పని అయింది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

కొందరు మాత్రం కోతి చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు.ఫొటో పిచ్చి ఉన్న యువతికి తగిన శాస్తి జరిగిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube