నేరం చేసిన వంటలక్క.. వాంటెడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్?

టాలీవుడ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందో చూసాం.మొదటినుండి ఆసక్తికరమైన కథతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఆడపడుచులకు అభిమాన సీరియల్ గా మారింది.

 Wanted Poster On Social Media About Karthika Deepam Deepa , Karthika Deepam, Deepa, Post Viral, Social Media , Premi Vishwanath-TeluguStop.com

ఇక ఆ సీరియల్ ను వంటలక్క కోసం చూస్తూ ఉంటారు చాలా మంది ప్రేక్షకులు.ఇక ఆ సీరియల్ లో దీపను ప్రేక్షకులు ముద్దుగా వంటలక్క అని పిలుచుకుంటారు.

ఇక స్టార్ మాలో ఈ సీరియల్ కు ఉన్న రేటింగ్ అంతా ఇంతా కాదు.ఇక వంటలక్క అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి అభిమానం ఉన్న నటి.ఇక వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.కేరళకు చెందిన మలయాళ నటి.కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సీరియల్ తోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

 Wanted Poster On Social Media About Karthika Deepam Deepa , Karthika Deepam, Deepa, Post Viral, Social Media , Premi Vishwanath -నేరం చేసిన వంటలక్క.. వాంటెడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.కానీ ఇప్పుడు ఆ సీరియల్ లో తన పాత్ర ముగియటంతో ఆమె అభిమానులు చాలా బాధపడ్డారు కూడా.

అసలు వంట లెక్కలేనిది సీరియల్ వేస్ట్ అంటూ.ఎలాగైనా వంటలక్కను సీరియల్ లో ఉండేలా చేయాలి అంటూ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు.

కానీ ఇప్పటికీ ఆమె ఎంట్రీ మాత్రం లేదు.అయినా కూడా ఆమె అభిమానులు తాను రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో అని ఎదురుచూస్తున్నారు.

వంటలక్క మాత్రం సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది.ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తెగ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు తనను షూట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ కు మలయాళం లో కూడా అభిమానులు ఎక్కువగా ఉన్నారు.సీరియల్ లో ఉండే వంటలక్క గెటప్ పక్కనపెడితే బయట ఉండే వంటలక్క గెటప్ ను చూసి అందరూ ఫిదా కావల్సిందే.

జీన్స్, టాప్స్ వేసి మాస్ లుక్ లతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈమె వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.

ఓ వైపు కార్తీకదీపం సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా మరోవైపు తెగ అవకాశాలు అందుకుంటోంది.ఇప్పటికే తన సోషల్ మీడియా వేదికగా తను అందుకున్న ప్రాజెక్టుల గురించి అప్డేట్ కూడా ఇచ్చింది.

అప్పుడప్పుడు స్టార్ మా లో నిర్వహించే ఈవెంట్లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో వాంటెడ్ దీప అంటూ ఒక ఫోటోని బాగా వైరల్ గా మారుస్తున్నారు తన అభిమానులు.అంతేకాకుండా తను నేరం చేసింది అని.ఇంతకు ఆ నేరం ఏంటంటే.తెలుగువారి హృదయాలను దోచుకొని అందర్నీ వదిలి దూరం వెళ్లిపోయింది అంటూ.ఈమెను పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డ్ ఇస్తామని వాంటెడ్ పోస్టర్ ను వదిలారు.ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube