Bigg Boss season 6 Faima : బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా తనని చూడాలనుకుంటున్నా... ఫైమా కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.ఈ కార్యక్రమం ఇప్పటికే 13 వారాలను పూర్తి చేసుకొని 14వ వారంలోకి అడుగు పెట్టింది.

 Want To See Her As The Winner Of Bigg Boss Season 6 Faima Comments Are Viral , B-TeluguStop.com

ఇక 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు.

అయితే ఈ కార్యక్రమంలో మొదటి నుంచి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ 13వ వారం వరకు కొనసాగుతూ వచ్చారు.ఇక 13వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫైమా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫైమా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో బాగా ఎంజాయ్ చేశానని అక్కడ లగ్జరీ లైఫ్ గడి పానని తెలిపారు.ఇక నేను బిగ్ బాస్ కార్యక్రమంలో ఏ మొదటి మూడు వారాలలోని బయటకు వస్తానని అనుకున్నాను కానీ ఇలా 13 వారాలు పాటు హౌస్ లో కొనసాగుతానని అసలు ఊహించలేదని తెలిపారు.

ఇక ఈ వారం కూడా తాను ఎలిమినేట్ కానని భావించాను.అయితే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యానని తెలిపారు.

Telugu Adi, Faima, Nagarjuna-Movie

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లినప్పటి నుంచి తాను ఎప్పుడూ ఎక్కడ ఏ విషయం గురించి తప్పుగా ప్రవర్తించలేదని అయితే చాలామంది నాకు కాస్త వెటకారం ఎక్కువగా ఉండటం వల్లే బయటకు వచ్చానని భావిస్తున్నారు.కానీ తాను ఎక్కడ వెటకారంగా ప్రవర్తించలేదని అలా కనుక చేసి ఉంటే నాగార్జున గారే తనని తిట్టేవారని చెప్పుకొచ్చారు.ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారనే విషయం గురించి తనకు తెలియదు కానీ బిగ్ బాస్ విన్నర్ మాత్రం ఆదిరెడ్డి అయితే చూడాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె ఆదిరెడ్డి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube