మీ ఆండ్రాయిడ్ డివైజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వివరాలు తెలుసుకోవాలా..? ఈ యాప్​తో చెక్ చేయండిలా..!

కొత్త ​ఫోన్‌ కొనేటప్పుడు అందులోని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.కొత్త ఫీచర్స్ కి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఓ సరికొత్త యాప్ ని ఎక్స్​డీఏ డెవలపర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

 Want To Know The Hardware And Software Details Of Your Android Device? Check With This App Hardware, Software, Dev Check, Technology Update, Technology News-TeluguStop.com

​ ‘డెవ్​చెక్‘ అనే యాప్ ద్వారా మీరు మీ ఆండ్రాయిడ్డివైజ్​కు సంబంధించిన అన్ని వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

అయితే, ఈ డెవ్​చెక్​ యాప్​ను ఎలా ఉపయోగించాలి.?

 Want To Know The Hardware And Software Details Of Your Android Device? Check With This App Hardware, Software, Dev Check, Technology Update, Technology News-మీ ఆండ్రాయిడ్ డివైజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వివరాలు తెలుసుకోవాలా.. ఈ యాప్​తో చెక్ చేయండిలా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట మీ ఆండ్రాయిడ్​ ఫోన్ లో ప్లే స్టోర్‌ ఓపెన్ చేసి.సెర్చ్ లో ‘DevCheck యాప్​ను సెర్చ్ చేయండి.

సెర్చ్ చేయగానే డెవ్ చెక్​ యాప్​ లోగోలో ‘i’ గ్రీన్​ సింబల్​ కలిగి ఉంటుంది.దాన్ని బట్టి ఒరిజినల్​ యాప్​గా మనం నిర్దారించుకోవచ్చు.

యాప్​లో ‘DevCheck హార్డ్‌వేర్, సిస్టమ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.అనంతరం డెవ్​ చెక్​ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్​ చేయండి.

DevCheck యాప్‌ ఓపెన్ అవ్వగానే డ్యాష్‌బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్​ చేయగానే మీ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన అన్ని సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ వివరాలు అక్కడ క్లారిటీగా కనిపిస్తాయి.దీనిలో టెంపరేచర్​, ఎస్​ఓసీ టెంపరేచర్​, జీపీయూ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ పర్సంటేజ్​, రామ్​, స్టోరేజ్​ లాంటి పలు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.అంతేకాక, ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్​ మోడల్, వెర్షన్, అప్‌టైమ్ వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఒకవేళ యాప్ ఓపెన్ చేసి మీరు రైట్ సైడ్ కు స్క్రోల్ చేస్తే హార్డ్‌వేర్, సిస్టమ్, బ్యాటరీ లాంటి పలు పేర్లతో మరో ఏడు ట్యాబ్‌లు కనిపిస్తాయి.వీటిపై క్లిక్​ చేసి మీ వైఫై సిగ్నల్ ​కు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

అంతేకాదు, డెవ్​చెక్ యాప్​ ద్వారానే మీ స్మార్ట్​ఫోన్​లోని ఇతర యాప్​లను కంట్రోల్​ చేసే ఆప్సన్ కూడా ఉంది.

Know about Android Device Hardware,Software Details

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube