సైతాను అనుచరులమంటూ... నర మాంసం తినాలనే కోరికతో... ఆ విద్యార్థులు .... వామ్మో !  

Want To Kill Friends And Eat It Her Student Friends-

తమ తోటి విద్యార్ధులను చంపి వారి నెత్తురు తాగి, మాంసం తినాలని కుట్ర పన్నిన ఇద్దరు విద్యార్ధినులను అమెరికా లోని సెంట్రల్‌ ఫ్లోరిడాలో అరెస్టు చేశారు. 11, 12ఏళ్ళ వయస్సు కలిగిన ఈ విద్యార్ధినులు స్కూల్లోని వాష్‌రూమ్‌ వద్ద వేచి వున్నారని, లోపలకు వెళ్ళిన వారు బయటకు రాగానే వారిపై దాడి చేసేందుకు కత్తులను కూడా సిద్ధంగా ఉంచుకున్నారని అధికారులు వీల్లడించారు...

సైతాను అనుచరులమంటూ... నర మాంసం తినాలనే కోరికతో... ఆ విద్యార్థులు .... వామ్మో ! -Want To Kill Friends And Eat It Her Student Friends

బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఆ విద్యార్ధినులపై హత్యకు కుట్ర, అక్రమంగా ఆయుధాలు కలిగి వుండడం, స్కూలు కార్యక్రమానికి ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. తాము సైతాను అనుచరులమని ఆ విద్యార్ధినులు చెప్పుకుంటున్నారు. విద్యార్ధినులను హతమార్చిన తర్వాత తాము కూడా చనిపోవాలని వారు అనుకున్నారని అధికారులు తెలిపారు.

స్కూల్లో యాజమాన్యం వీరి కదలికలు అనుమానాస్పదంగా వుండడంతో అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.