దోమలను చంపే మ్యూజిక్‌.. ఆలౌట్‌కు కూడా పోని దోమలు ఆ మ్యూజిక్‌కు పరార్‌  

Want To Get Rid Of Mosquitoes Play Them Some Skrillex-

ఎవరో ఒక కవి సంగీతంతో రాళ్లు కరిగించొచ్చు, మేఘాలను కురిపించొచ్చు అన్నాడు.ఆయన అన్న విషయాన్ని తెలుగు సినిమా మేకర్స్‌ చేసి చూపించారు.తమ సినిమాల్లో కామెడీగా సంగీతంతో ఆ పని చేయించారు...

Want To Get Rid Of Mosquitoes Play Them Some Skrillex--Want To Get Rid Of Mosquitoes Play Them Some Skrillex-

అయితే సంగీతంతో ఆ పని జరగడం కామెడీగా మాత్రమే జనాలు నమ్ముతున్నారు.సీరియస్‌గా మాత్రం జరగదు అని అందరి అభిప్రాయం.రాళ్లు బద్దలు అవ్వడం ఏమో కాని ఒక రకమైన సంగీతం వల్ల దోమలు కుట్టడం మర్చిపోవడంతో పాటు, మగదోమలు ఆడదోమలతో కలవడం కూడా మర్చి పోయి ఫ్రీజ్‌ అవుతున్నాయి.

ఆ సంగీతం ఆఫ్‌ చేసిన తర్వాత కొంత సమయం వరకు అవి ఏం చేయలేక పోతున్నాయి.

Want To Get Rid Of Mosquitoes Play Them Some Skrillex--Want To Get Rid Of Mosquitoes Play Them Some Skrillex-

ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు నిర్థారించిన దాని ప్రకారం దోమలకు ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పెద్ద శత్రువు.డబ్‌ స్టెప్‌ అనే ఎలక్ట్రికల్‌ సంగీతం దోమలపై ఎక్కువగా పని చేస్తుందని నిరూపించారు.

కొన్ని పదుల దోమలను ఒక చోట బందించి శాస్త్రవేత్తలు మ్యూజిక్‌ను ప్లే చేశారు.ఆ మ్యూజిక్‌ వల్ల దోమలు ఒకదానికి ఒకటి సిగ్నల్స్‌ ఇచ్చుకోవడం మర్చి పోయాయి.ఆ మ్యూజిక్‌ వల్ల అత్యంత గందరగోళంకు గురయినట్లుగా అనిపించింది.

ఆ మ్యూజిక్‌ ఉన్నంత సమయం అవి ఏం చేయకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి.ఆ మ్యూజిక్‌ వింటున్న సమయంలో మనుషులను కుట్టాలనే ఆలోచన కూడా వాటికి రావడం లేదు అంటూ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్తలు గమనించారు.

దోమలు శబ్దాలను వినగలవు, అయితే అవి ఒక స్థాయి ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే వినగలవు.అది కూడా కొన్ని కర్ణకటోరమైన సంగీతం వింటే అవి ఏ పని చేయలేవు.

అందుకే దోమలకు స్క్రిలెక్స్‌ అనే అమెరికన్‌ సంగీత దర్శకుడు దోమల గురించి పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు జత అయ్యి వాటికి కర్ణకటోరమైన సంగీతంను ట్యూన్‌ చేశాడు.కొన్ని వందలు, వేల దోమలపై ప్రయోగం చేసిన ఈమ్యూజిక్‌ బాగా పని చేస్తుందని నిపుణులు అన్నారు.ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరల్‌ అవుతున్న ఈ మ్యూజిక్‌ మనుషులు వినేందుకు పర్వాలేదు అన్నట్లుగా ఉంది...

కాని దోమలకు మాత్రం ప్రాణ సంకటంగా ఉంది.

మీకోసం ఆ మ్యూజిక్‌ లింక్‌ను ఇవ్వడం జరిగింది.పైసా ఖర్చు లేని పని, ఒకసారి ప్రయత్నిస్తే పోలా.అందరికి ఉపయోగపడే ఈ విషయాన్ని షేర్‌ చేయండి.