మనలో బర్గర్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.అయితే కేఫ్ లలో తినే బర్గర్లు అంత శ్రేయస్కరంకాదు.
అయితే మన ఇంటిలోనే చాలా ఈజీగా ఆరోగ్యవంతమైన బర్గర్లు తయారు చేసుకోవచ్చు.ఇకపోతే రొటీన్ గా కాకుండా మన కిచెన్లో వుండే కొన్ని ఐటమ్స్ తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.
టిఫిన్ లలో ఇడ్లీ అంటే ఎంతోమంది ఇష్టపడతారు.ఎందుకంటే ఆయిల్ లేనిది.
మరియు సురక్షితమైనది.అయితే అదే ఇడ్లీతో బర్గర్ ఎందుకు తయారు చేయకూడదు? ఇలాంటి కత్తిలాంటి ఐడియా వచ్చింది ఒకామెకు.ఇంకేముంది క్షణాల్లో బర్గర్ తయారు చేయడమే కాకుండా.అదెలా చేయాలో చెబుతోంది కూడా.
సాధారణంగా బర్గర్ అంటే.బన్‌ను నిలువగా కోసి దాని మధ్యలో కూరగాయలు, సాస్, ఆలుటిక్కా లేదా చికెన్ టిక్కాలు, చీజ్ పెడతారు.
తినేప్పుడు అది చాలా స్పైసీగా, క్రంచీగా ఉంటుంది.చాలామంది దీనిని ఎంతగానో ఇష్టపడతారు.
అయితే బయట తినే బర్గర్లు అంత మంచివి కాదు.మీకు కూడా ఆ రుచి కూడా తెలిసే ఉంటుంది.
అయితే ఇక్కడ ఇడ్లీతో బర్గర్ అంటే ఎలా ఉంటుందనేగా మీ సందేహం? అయితే, అది ఎలా చేయాలో ఇక్కడ పొందుపరిచినా వీడియోలో చూసి నేర్చుకోండి.
Street food Bhagyanagar ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక దీనికి మీకు కావల్సింది జస్ట్ రెండు ఇడ్లీలు, ఆలు టిక్కా, చట్నీ, వెజ్ మయోనేజ్ ఉంటే చాలు.ఇపుడు అదెలా చేయాలో తెలుసుకుందాం.ముందుగా ఒక పెద్ద సైజు ఇడ్లీ తీసుకుని దానికి స్పైసీ చట్నీ రాయాలి.ఆ తర్వాత వెజ్ మయోనేజ్ దానికి అద్దాలి.
దానిపై ఆలు టిక్కా పెట్టి, మళ్లీ వెజ్ మయోనేజ్, చట్నీ, కాస్త టమోటా సాస్ అవసరమైనంత పూయాలి.ఆ తరువాత మనం ముందుగా తయారు చేసుకున్న ఇడ్లీ ని పెడితే చాలు.
ఇడ్లీ బర్గర్ రెడీ.ఒకసారి ట్రై చేసి చూడండి.