రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.
మొట్టమొదటిసారిగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న ఈమె ఓ సందర్భంలో తన మనసులో మాటలను బయట పెట్టింది.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాజాగా తన కుటుంబం మొత్తం పుష్ప సినిమా చూశామని ఈ సినిమా చూసిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారని తెలియజేశారు.
ఈ సినిమా చూసిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ తనని అల్లుఅర్జున్ సరసన ఎప్పుడు నటిస్తావని అడుగుతున్నట్లు తెలియజేశారు.పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా అలియా తన మనసులో మాటను బయటపెట్టారు.
అల్లుఅర్జున్ తో కలిసి నటించడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా ఈ బ్యూటీ తెలియజేశారు.రాజమౌళి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.మరి పుష్ప రాజ్ తో కలిసి నటించే అవకాశం ఈమెకు ఎప్పుడు వస్తుందో.
ఈ విషయంపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy