2025 నాటికి 20 వేల మంది భారత విద్యార్థులే మా టార్గెట్ : ఫ్రాన్స్ మంత్రి

భారతీయ విద్యార్ధులకు ఉన్నత విద్య అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీలే .కానీ ఇప్పుడిప్పుడే ఈ వైఖరిలో మార్పు వస్తోంది.

 Want Indian Students In France To Climb To 20,000 By 2025: French Minister Cathe-TeluguStop.com

యూరప్‌, ఆసియాలలోని పలు దేశాలపై భారతీయ విద్యార్ధులు దృష్టి సారిస్తున్నారు.ఇందులో ఫ్రాన్స్ కూడా ఒకటి.

మెరుగైన జీవన విధానం , నాణ్యమైన విద్య కారణంగా ఇప్పుడిప్పుడే భారతీయ విద్యార్ధులు ఫ్రాన్స్ బాట పడుతున్నారు.అయితే ఈ సంఖ్యను మరింత పెంచుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వం భావిస్తోంది.2025 నాటికి 20 వేల మంది భారతీయ విద్యార్ధులు తమ దేశంలో చదువుకోవడమే టార్గెట్‌గా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా .మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె మంగళవారం భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.భారతీయ విద్యార్ధులను ఆకర్షించడం అంత తేలిక కాదని తమకు తెలుసునని, కాకపోతే భారత్- ఫ్రాన్స్‌ల మధ్య అవకాశాలకు ఆకాశమే హద్దు అని కేథరీన్ అన్నారు.

విద్యా రంగంలో లింగ సమానత్వం అవసరమని ఆమె నొక్కి చెప్పారు.ప్రస్తుతం ఈ విషయంలో ప్రపంచం చాలా ముందుందని, కానీ తాము ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని కేథరీన్ అంగీకరించారు.

సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు జరగనున్న తన భారత పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి మనదేశంలోని పారిశ్రామిక ప్రముఖులతో భేటీతో పాటు చారిత్రాక ప్రదేశాలను సందర్శించేందుకు ముంబైకి చేరుకుంటారు.బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ద్వైపాక్షిక, ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై ఆమె చర్చలు జరపనున్నారు.

ఇకపోతే.ఈ ఏడాది జూన్ 19న జరిగిన ఫ్రాన్స్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రిస్కా థెవెనోట్ ఎన్నికైన సంగతి తెలిసిందే.

ప్రిస్కా ముత్తాత దక్షిణ భారతదేశానికి చెందిన వారు.వీరి కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం మారిషస్‌కు వలస వెళ్లింది.

ఆమె తల్లి బాలసుబ్రమెన్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.అల్సాస్ ప్రాంతంలోని స్ట్రాస్‌బర్గ్‌లో ప్రిస్కా జన్మించారు.

స్టెయిన్స్‌లో, తర్వాత గ్రాండే ఎకోల్‌లో ఆమె చదువుకున్నారు. సామాజిక సేవ, పౌర చర్యలపై ప్రిస్కాకు తొలి నుంచి ఆసక్తి వుంది.

ఈ క్రమంలోనే సివిల్ ఇంపాక్ట్ అసోసియేషన్‌ను స్థాపించారు.

ఫ్రెంచ్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 8వ నియోజకవర్గమైన హౌట్స్ డీ సీన్‌ నుంచి ఎల్ఆర్ఈఎం పార్టీ అభ్యర్ధిగా 65.75 శాతం ఓట్లతో ఆమె విజయం సాధించారు.తద్వారా థెవెనోట్.

ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీలోని యువతకు రోల్ మోడల్‌గా మారారు.తాజా ఎన్నిక నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో వున్న భారత సంతతి యువకులు రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube