వైరల్ వీడియో: వామ్మో.. బర్త్ డే సందర్భంగా 550 కేక్స్ కట్..!

మన చిన్నప్పుడు పుట్టినరోజు అనగానే మనకు ఎంతో సంతోషంగా ఉండేది కదా.పొద్దునే లేచి స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని అమ్మ చేసిన పాయసం తిని గుడికి వెళ్లి సాయంత్రం పూట ఎంచక్కా మన చుట్టుపక్కల స్నేహితులను చుట్టాలను పిలిచి కేక్ కట్ చేసి పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకుని వారి ఆశీర్వచనాలు పొందాక వచ్చిన వారికి చాకెలెట్స్ పంచి పెట్టేవాళ్ళము కదా.

 Wammo .. Cut 550 Cakes On The Occasion Of Birthday Viral Latest, Viral Latest,-TeluguStop.com

అయితే నిజంగా ఆ రోజులే వేరు కదా.ఎంత పెద్ద కేక్ కట్ చేసాము అనేది కాదు అసలు కేక్ కట్ చేశామా లేదా అన్నది ముఖ్యం.అది చిన్నదా, పెద్దదా, లేక ఒకటా రెండా అన్నది కాదు ముఖ్యం.చిన్నతనంలో చేసిన సందడే వేరు కదా.అయితే ఈ రోజుల్లో బర్త్ డే వేడుకలు అంటే అంబరాన్ని అంటుతున్నాయి.

చిన్నప్పుడంటే అమ్మ నాన్న కేక్ కట్ చేయించేవారు.

మరి పెద్దయ్యాక బర్త్ డే అంటే చాలు అతడి స్నేహితులు కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తున్నారు.కాగా ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ స్టైల్ లో బర్త్ డే వేడకలను జరుపుకుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి మాత్రం అందరికన్నా కాస్త డిఫరెంట్ గా పుట్టినరోజు జరుపుకున్నాడు.ఒకటా.

రెండా ఏకంగా 550 కేకులు కట్ చేసి పుట్టిన రోజను గ్రాండ్ గా జరుపుకున్నాడు.ఇప్పుడు ఇతను కట్ చేసిన 550 కేక్ ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలు వివరాల్లోకి వెళితే.ఈ బర్త్ డే వేడుకలు మహారాష్ట్రలో జరిగినట్లు తెలుస్తుంది.

ముంబై లోని కందివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో సూర్య రాతూరి అనే వ్యక్తి ఇలా ఒకేసారి రెండు చేతులలో రెండు చాకులు పట్టుకుని 550 కేకులు కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యంలో ఉండిపోయారు.ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే లేనివాళ్ళకి సహాయం చేయవచ్చు కదా.ఇలా చేయడం ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.గతంలో కూడా ఇలానే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బసవరాజ్ దాడేసుగూర్ సురేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇలాగే పది నుంచి పదిహేను కేకులు కోసిన వీడియో వైరల్ గా మారింది.అయితే ఇతను ఇంకాస్త వెరైటీ అనే చెప్పాలి.

ఎవరయినా కేకులను చాకుతో కట్ చేస్తే మనోడు మాత్రం ఏకంగా ఐఫోన్‌ ను ఉపయోగించాడు.అప్పట్లో ఈ వీడియోపై ఒక రేంజ్ లో విమర్శలు కూడా వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube