వాల్తేరు వీరయ్య వర్సెస్‌ వీర సింహారెడ్డి.. ఎవరు ముందు?

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ ద్వారా వస్తాయా అంటూ ప్రేక్షకులు అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ రెండు సినిమాలు కూడా ఒక్క రోజు తేడా తో బాక్సాఫీస్ వద్ద దాడి చేసిన విషయం తెలిసిందే.

 Waltrai Veerayya And Veera Simhareddy Movies Ott Streaming Update,waltair Veeray-TeluguStop.com

రెండు కూడా భారీ వసూళ్లు నమోదు చేసి ఆయా హీరోల అభిమానులను సంతోష పెట్టాయి.ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీ లో కూడా కాస్త అటు ఇటుగా అలాగే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.

ఆ మధ్య తెలుగు నిర్మాతల మండలి థియేటర్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలి అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ కండిషన్ ని ఈ రెండు చిత్రాలు పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Balakrishna, Chiranjeevi, Ott, Veera Simha-Movie

అదే జరిగితే ఖచ్చితం గా అభిమానులు మరిన్ని రోజులు ఎక్కువగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమా లను కూడా ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసేసిందట.రెండు సినిమాలకు కూడా భారీ మొత్తం లో డబ్బు చెల్లించి మరీ వారు కొనుగోలు చేశారట.

Telugu Balakrishna, Chiranjeevi, Ott, Veera Simha-Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీర సింహా రెడ్డి కంటే ఒకటి లేదా రెండు రోజుల ముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.8 వారాలు పూర్తి అయిన వెంటనే ఈ రెండు సినిమాలు కూడా మరో సారి ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లు కచ్చితం గా మరో లెవెల్ లో ఓటీటీ ద్వారా సక్సెస్ ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube