ఆ రెండు సీన్స్ వాల్తేరు వీరయ్యకు హైలెట్ కానున్నాయా.. గుడ్ న్యూస్ అంటూ?

2023 సంక్రాంతి పండుగ కానుకగా ఆలస్యంగా రిలీజవుతున్న సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి.చిరంజీవి నిర్ణయం మేకర్స్ మేకర్స్ ఈ సినిమాను జనవరి 13వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

 Walteir Veeraiah Movie Scenes Details Here Goes Viral In Social Meida , Waltheru-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవికి మాస్ మహారాజ్ రవితేజ తోడు కావడంతో ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవుతుందని చిరంజీవి, రవితేజ అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

మూడు వారాల గ్యాప్ లో రవితేజ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు రెండు సన్నివేశాలు ఉన్నాయని ఈ రెండు సీన్లు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని సమాచారం అందుతోంది.ఖైదీలోని పోలీస్ స్టేషన్ సీన్, ముఠామేస్త్రి సినిమాలోని మాస్ స్టెప్ ఈ సినిమాలో ఉన్నాయని ఈ రెండు సీన్లు మూవీ రేంజ్ ను చిరంజీవి మూవీ స్థాయిని మరింత పెంచుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.చిరంజీవి, శృతి హాసన్ జోడీ బాగుందని కామెంట్లు వినిపిస్తుండగా చిరంజీవి, శృతి జోడీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి రవితేజ ఈ సినిమాలో అన్నాదమ్ములుగా కనిపించనున్నారు.

ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. బాబీ ఈ సినిమా విషయంలో కేర్ తీసుకున్నారు.వెంకీ మామ తర్వాత బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడనున్నామంటే ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి.చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా త్వరలో మరిన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube