టిక్‌టాక్‌ కొనుగోలుకు మరో సంస్థ ప్రయత్నాలు

చైనా కు చెందిన టిక్‌టాక్‌ను ఇప్పటికే ఇండియాలో బ్యాన్‌ చేశారు.త్వరలో అమెరికాలో కూడా బ్యాన్‌ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

 Walmart Want To Buy Tiktok, Tik Tok, Wal Mart, India, America, Donald Trump, Mic-TeluguStop.com

ఆ లోపు అమెరికన్‌ సంస్థ ఏదైనా టిక్‌ టాక్‌ ను కొనుగోలు చేస్తే పర్వాలేదు అంటూ ట్రంప్‌ అల్టిమేటం జారి చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో టిక్‌ టాక్‌ ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, జియో ఇలా పలు సంస్థలు ఇప్పటికే టిక్‌టాక్‌ తో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.ఇప్పుడు కొత్తగా వాల్‌ మార్ట్‌ సంస్థ కూడా ఈ జాబితాలో చేసింది.

సెప్టెంబర్‌ 10వ తారీకు వరకు టిక్‌టాక్‌ను చైనా కంపెనీ నుండి మరో కంపెనీ కొనుగోలు చేయాల్సి ఉన్న సమయంలో వాల్‌ మార్ట్‌ దాన్ని మైక్రోసాఫ్ట్‌ తో కలిసి కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యిందట.ఈ విషయంలో కంపెనీల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.టిక్‌ టాక్‌పై అమెరికా ప్రభుత్వం పెంచుతున్న ఒత్తిడితో త్వరలోనే డీల్‌ కుదిరే అవకాశం ఉందని అంటున్నారు.

త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.టిక్‌ టాక్‌ ను చైనా కంపెనీ నుండి ఏ ఇతర దేశంకు చెందిన సంస్థ కొనుగోలు చేసినా ఇండియాలో దాని కార్యకళాపాలు మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube