అమెరికాలో ఇలాంటి చావులు ఇంకెన్నాళ్ళు...!!

అగ్రరాజ్యం అమెరికా నిత్యం వార్తలో ఏదో ఒక్క అంశం తో హాట్ టాపిక్ గా ఉంటుంది.ప్రతిరోజు ఓ సెన్సెషన్ వార్తతో వార్తల్లో నిలుస్తుంది.

 Gunfire At Walmart Distribution Center In California, California,walmart,donald-TeluguStop.com

అంతక ముందు అమెరికా-ఇరాన్ గొడవలు ఆగం ఆగం చేసారు, ఆ తరువాత కరోనా కష్టాలు, ఆ తరువాత చైనా కావలనే కరోనా సృష్టించింది.అది చైనీస్ వైరస్ నే అంటూ చిందులేసిన ట్రంప్, ఆ తరువత కరోనా రికార్డ్ కేసులు.

మరణాలు, ఆ తరువాత హ్1బ్ వీసా తిప్పలు, ఆ తరువాత నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ హత్య ఉద్దాంతం.ఇలా రోజు ఒకా కొత్త వార్తతో అమెరికా తెర పై కనిపిస్తూనే ఉంటుంది.

ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెల్సిందే.ఇలాంటి సమయాల్లో కూడా అమెరికాలో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి.అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.

ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని ప్రయత్నాలు చేస్తునా ఫలితం కనిపించలేదు.అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.

గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు.దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది.

బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండాపోయింది.అందుకు నిదర్శనం తాజాగా జరిగిన ఈ ఘోరమే.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వాల్‌మార్ట్‌ రెడ్‌బుల్ఫ్‌ పంపిణీ కేంద్రం తుపాకుల మోతతో దద్దరిల్లింది.ఆదివారం ఓ ఆగంతుకుడు వాల్‌మార్ట్‌ రెడ్‌బుల్ఫ్‌ పంపిణీ కేంద్రం లోకి తుపాకీతో చొరబడి కాల్పులు జరుపడంతో ఇద్దరు మృతి చెందారు.

మరో నలుగురికి గాయాలయ్యాయి.ఆ ఆగంతకుడు నేరుగా ఇద్దరి ఛాతీపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడ్డిన వారిని చికిత్స్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కాలిఫోరియా రాజధాని స్యాక్రోమెన్‌టోకు సుమారు 120మైళ్ల దూరంలోని ఉత్తర ప్రాంతంలోని రెడ్‌బుల్ఫ్‌ డిస్టిబ్యూటరీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన పై రెడ్‌బుల్ఫ్‌ ప్రాంతంలోని ఎలిజబెత్‌ కమ్యూనిటీ హాస్పిటల్‌ అధికార ప్రతినిధి అలీసన్‌ హెడ్రిక్‌సన్ మాట్లాడూతూ‌.

వాల్‌మార్ట్‌ రెడ్‌బుల్ఫ్ సిబ్బంది షిప్టు మారుతుండగా ఆగంతకుడు డిస్టిబ్యూటరీ కేంద్రంలోకి ప్రవేశించి కాల్పులు జరిపిన్నట్లు తెలిపారు.ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్నవారు.

ఒక్కసరిగా ఉలిక్కిపడ్డారు.ఆగంతుడికోసం గాలిస్తున్నామని.

ఎట్టిపరిస్ధితిలోను అతన్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube