సంక్రాంతి – 2021 కి అరణ్య గా రాబోతున్న రానా..!  

wallpapers rana is coming as a wilderness by 2021 aranya, daggubati rana, sankranthi 2021, social media, twitter, poster, Jadavu Priyank, Central Govt, Un Lock, Vishnu Vishal - Telugu Aranya, Central Govt, Daggubati Rana, Jadavu Priyank, Poster, Sankranthi 2021, Social Media, Twitter, Un Lock, Vishnu Vishal

దగ్గుబాటి రానా టైటిల్ రోల్ లో నటించిన చిత్రం అరణ్య.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పనులను పూర్తి చేసుకుని ఉంది.

TeluguStop.com - Wallpapers Rana Is Coming As A Wilderness By 2021

అయితే 2020 ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు చిత్ర బృందం.ఈ సినిమాని తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

దాదాపు గడిచిన ఎనిమిది నెలల నుండి ఇప్పటివరకు థియేటర్స్ మూతపడే ఉండడంతో ఈ సినిమాను విడుదల చేయలేకపోయారు.

TeluguStop.com - సంక్రాంతి – 2021 కి అరణ్య గా రాబోతున్న రానా..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ లాక్ లో భాగంగా అక్టోబర్ 15 నుండి థియేటర్స్ ను ఓపెన్ చేశారు.

ఇందులో భాగంగానే అరణ్య చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.ఇన్నాళ్లు జరిపిన నిరీక్షణకు ఎట్టకేలకు ముగింపు లభించింది.

ఇందుకు సంబంధించి తాజాగా హీరో దగ్గుబాటి రానా 2021 సంక్రాంతికి మీ దగ్గర లోని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటూ ఓ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఈ సినిమాను ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో పాటు విష్ణువిశాల్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా కథ నేపథ్యం అస్సాంలో జరిగిన నిజమైన సంఘటన నేపథ్యంలో తెరకెక్కింది.

జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.చూడాలి మరి చాలా రోజుల తర్వాత తెరపై కనిపించబోతున్న దగ్గుబాటి రానా ఏవిధంగా మెప్పించగలడో.

#Daggubati Rana #Aranya #Twitter #Jadavu Priyank #Vishnu Vishal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wallpapers Rana Is Coming As A Wilderness By 2021 Related Telugu News,Photos/Pics,Images..