రెండో అంతస్తు నుండి దూకిన చడ్డీమ్యాన్.. వీడియో వైరల్!

కొన్ని సందర్భాలలో తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటూ ఉంటారు.వాళ్లు చట్టం శిక్షను తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి శిక్షను మాత్రం తప్పించుకోలేరు.

 Wallisellan Switzerland Caddimyan-TeluguStop.com

మన నిజజీవితంలో ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అవుతుంది.ఒంటిపై చడ్డీ తప్ప మిగతా దుస్తులేవీ లేని వ్యక్తి స్విట్జర్లాండ్ నగరంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు.

చడ్డీ మ్యాన్ పోలీసుల నుండి తప్పించుకున్నాడు కానీ దేవుడి శిక్ష నుండి మాత్రం తప్పించుకోలేకపోయాడు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాలలోకి వెళితే స్విట్జర్లాండ్ లోని వాలీసెల్లాన్ నగరంలోని హోటల్ లోని ఒక వ్యక్తి దిగాడు.పోలీసులకు తాము వెతుకుతున్న వ్యక్తి ఆ హోటల్ లో ఉన్నాడని తెలియడంతో అతని వెంటబడ్డారు.

అకస్మాత్తుగా పోలీసులు వెంటపడటంతో గదిలో చడ్డీతో ఉన్న చడ్డీమ్యాన్ పరుగులంకించుకున్నాడు.

కిటికీ నుండి కిందకు దూకి తన ప్రాణాలను రక్షించుకోవాలని చడ్డిమ్యాన్ అనుకున్నాడు.

కానీ అతను ఊహించని విధంగా అతను వేసిన ప్లాన్ బెడిసికొట్టింది.దూకే ప్రయత్నంలో చడ్డీమ్యాన్ కింద వేగంగా వెళుతున్న కారుపై బొక్కాబోర్లా పడ్డాడు.

ఆ తరువాత కారు మీద నుండి పల్టీలు కొట్టిన చడ్డీమ్యాన్ చివరకు నేలపైకి జారి తీవ్రగాయాలపాలయ్యాడు.అటుగా కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఈ ఘటనను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం చడ్డీ మ్యాన్ వీడియో విపరీతంగా వైరల్ కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube