గోడ చర్చలు విఫలం..ట్రంప్ బై బై...     2019-01-11   12:02:33  IST  Surya Krishna

అమెరికాలో మెక్సికో సరిహద్దుల్లో గోడ వ్యవహారం అమెరికా మొత్తాని కుదిపేస్తోంది. గోడ కట్టాల్సిందే నని ట్రంప్ , అంత ఖర్చు ఎందుకు వద్దూ అంటూ డెమోక్రాట్లు. ఇలా ఇరు వర్గాలు గత కొంతకాలంగా వాదోప వాదాలు చేసుకుంటున్నారు. ఇదే అంశంపై తాజాగా చర్చలకి కూర్చున్న ఇరు వర్గాల చర్చలు ఫలించక పోవడంతో ట్రంప్ చర్చల మధ్యలోనే ఆవేశంగా నిష్క్రమించారు.

Wall Meetings Failed And Trump Says Bye-Immigrants NRI Telugu News Updates In America

Wall Meetings Failed And Trump Says Bye

5.7 బిలియన్ డాలర్ల ఒక గోడ కోసం ఖర్చు పెట్టడం అస్సలు కుదరదని డెమోక్రాట్లు తెగేసి చెప్పడంతో ఒక్క సారిగా ట్రంప్ బల్లపై గట్టిగా చరుస్తూ ట్రంప్ సమావేశం నుంచి వెళ్లిపోవడంపై స్పీకర్ నాన్సీ పెలోసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోడ నిర్మాణంతో ఎన్నో రకాల లాభాలు అమెరికా ప్రజలకి ఉన్నాయని ఎంతగా చెప్పినా డెమోక్రాట్లు తనకి సహకరిచడం లేదని ట్రంప్ గుర్రుగా ఉన్నారు.

Wall Meetings Failed And Trump Says Bye-Immigrants NRI Telugu News Updates In America

అయితే ఇరువురి గొడవల కారణంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన గత నెల 22వ తేదీ నుంచి నడుస్తూనే ఉంది. 1995-96 లో ఉద్యోగులు దాదాపు 21 రోజులు విధులకు హాజరు కాలేదు..అయితే ఇప్పటికి ఈ గొడవలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.