టెకీలకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో వాల్‌మార్ట్ ఉద్యోగ ప్రకటన...!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ వాల్ మార్ట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది.రీటైల్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రెడీ అయింది.

 Good News For Techies Walmart Job Advertisement With Huge Salary  Wall Mart, E C-TeluguStop.com

టెక్నాలజీని మరింత పెంచుకుని పోటీ సంస్థలకు దీటైన జవాబు ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది.దీని కోసం భారీ సంఖ్యలో టెకీల నియామకం చేపట్టనుంది.

ఉద్యోగాల భర్తీతో పాటు భారీ వేతనాలు కూడా అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ-కామర్స్ బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ మేరకు దేశంలో ఎన్నో కంపెనీలు తమ సేవలను విస్తృత పరుచుకుంటున్నాయి.ఫోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు వీలుగా మెరుగైన సేవలు, ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

ఈ మేరకు వాల్ మార్ట్ కూడా తన సేవలను విస్తృతంగా పరచాలని భావిస్తోంది.దీని కోసం కంపెనీ తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి టెకీలను నియమించనుంది.

దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు సంస్థ యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

వాల్ మార్ట్ సంస్థలో టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణ కోసం భారీగా టెకీలను నియమించేందుకు సంస్థ సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా దాదాపుగా 1000 మంది టెకీలను నియమించుకోనుంది.ఇందులో అర్హత సాధించిన ఉద్యోగులకు భారీ స్థాయిలో వేతనాలు అందించనుంది.ఎంపిక సాధించిన టెకీలకు రూ.6 లక్షల నుంచి 22 లక్షల వరకు వేతనాలు అందించనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.అయితే ఇప్పటికే బెంగళూరు, గురగావ్ కేంద్రాలుగా వాల్ మార్ట్ తన సేవలను అందిస్తోంది.వీటిల్లో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు.పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడాలని కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచింది.సామర్థ్యం పెరిగితే దేశ వ్యాప్తంగా సేవలు విస్తృతం చేయవచ్చని వాల్ మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube