పాపం, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తల్లికి కూడా కరోనా పాజిటివ్!  

Wajid Khan Mother Corona Positive - Telugu Coronavirus, Irfan Khan, Lock Down, Music Director, Rishi Kapoore, Wajid Khan, Wajid Khan Mother

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ఇతర ఆరోగ్య కారణాలతో పాటు కరోనా వైరస్ కూడా సోకడం తో చిన్న వయస్సులోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.కరోనా మహమ్మారి నేపథ్యంలో బాలీవుడ్ లో చాలా విషాదాలు చోటుచేసుకున్నాయి.

 Wajid Khan Mother Corona Positive

కారణాలు ఏవైనా బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఒక్కొక్కరు మృతి చెందుతూ వచ్చారు.దీనితో బాలీవుడ్ లో చాలా విషాదం చోటుచేసుకుంది.

నిన్న ఉదయం వాజిద్ ఖాన్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం తో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.అయితే గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడతున్న ఆయనకు ఇటీవలే కరోనా సోకింది.

పాపం, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తల్లికి కూడా కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం తో ముంబై లోని చెంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

అయితే వాజిద్ ఖాన్ కరోనా వైరస్ వల్ల మృతి చెందినట్లు తేలడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా టెస్టు చేశారు.

ఈ సమయంలో వాజిద్ ఖాన్ తల్లి కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు.దీనితో ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

గత కొన్ని నెలలు గా అనారోగ్యంగా ఉన్న కొడుకును చూసుకోవడం కోసం ఆమె అతనితోనే కలిసి ఉంటుంది,ఈక్రమంలోనే ఆమెకు కూడా ఈ వైరస్ సోకినట్లు డాక్టర్లు చెబుతున్నారు.అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై వివరాలు వెల్లడించలేదు.

కోవిడ్ తో అల్లాడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటుచేసుకోవడం తో బాలీవుడ్ మొత్తం విషాదం లో మునిగిపోయింది.ఈ లాక్ డౌన్ సమయంలోనే ప్రముఖ నటులు ఇర్ఫాన్ ఖాన్,రిషి కపూర్ వంటి ప్రముఖులు కూడా మృతి చెందడం ఇప్పుడు తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wajid Khan Mother Corona Positive Related Telugu News,Photos/Pics,Images..

footer-test