విషాదం : కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ మృతి...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి  గురించి చెప్పనవసరం లేదు.కాగా ఈ కరోనా వైరస్ సాధారణ ప్రజలపై గా కంటే పలు వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

 Wajid Khan, Bollywood Singer, Bollywood, Death News,-TeluguStop.com

తాజాగా పలు బాలీవుడ్ చిత్రాల్లో పాటలను పాడినటువంటు బాలీవుడ్ ప్రముఖ సింగర్ వాజిద్ ఖాన్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ వాజిద్ ఖాన్  పలు కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు.

దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు వాజిద్ ఖాన్ కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.అప్పటికే పలు వ్యాధుల సమస్యతో బాధ పడుతున్నటువంటి వాజిద్ ఖాన్ కరోనా వైరస్ బారి నుంచి కోలుకోలేకపోయాడు.

దీంతో తాజాగా ముంబై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం సమయంలో కన్నుమూశాడని ఆయన సోదరుడు సాజిద్ ఖాన్ అధికారికంగా తెలిపారు.

అయితే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో పాటలు పాడి బాలీవుడ్ చిత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి వాజిద్ ఖాన్ గొంతు ఇకపై వినిపించదనే  వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

 కాగా ప్రస్తుతం వాజిద్  ఖాన్ కి 42 సంవత్సరాలు.

ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఓ సింగర్ ఇలా కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా కాలం చేయడంతో పలువురు సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు గాయకుడు వాజిద్ ఖాన్  కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజే స్తున్నారు.

అంతేగాక  ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ఎలాంటి  సమస్య  వచ్చినా దగ్గర్లో ఉన్నటువంటి వైద్యులను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube