కరోనా కరువు సమయంలో భారీ టిప్ అందుకున్న వెయిటర్!  

Waiter got Thousand Dollars in Social Media, Social media, Viral Post - Telugu Social Media, Viral Post, Waiter Got Thousand Dollars In Social Media

కరోనా మహమ్మారి తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది జీవితాలు చిన్నా భిన్నమయ్యాయో అందరికీ తెలిసిందే.పేద,ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా తో నలిగిపోయారు.

 Waiter Tip Goes Viral Social Media

ఈ మహమ్మారి నేపథ్యంలో అన్ని దేశాలు కూడా రెస్టారెంట్ లు,పలు హోటల్స్ ను మూసి వేయడం తో అక్కడ పనిచేసే సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.అయితే ఇటీవల వాటిపై సడలింపులు ఇవ్వడం తో ఇప్పుడిప్పుడే అవి తిరిగి మరలా తెరుచుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఒక కస్టమర్ ఒక వెయిటర్ పట్ల తన ఉదారత చూపించాడు.ఏకంగా ఆ వెయిటర్ కు భారీగా టిప్ ను అందించాడు.
ఈ ఘటన అమెరికా లోని ది స్టార్వింగ్ రెస్టారెంట్ అనే హోటల్ లో చోటుచేసుకుంది.ఆ హోటల్ కు వచ్చే ఒక రెగ్యులర్ కస్టమర్ ఇటీవలే తన ఫ్యామిలీ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్లాడు.

కరోనా కరువు సమయంలో భారీ టిప్ అందుకున్న వెయిటర్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే వారికి కావాల్సినవి ఆర్డర్ చేసుకొని తిన్న తరువాత బిల్ పే చేసే సమయం వచ్చింది.దీనితో వెయిటర్ బిల్ తెచ్చి ఇవ్వగా మొత్తం 43 డాలర్ల బిల్లు చేయగా, బిల్లు తో పాటు టిప్ గా ఏకంగా 1000 డాలర్లు ఇచ్చాడు.

అనంతరం బిల్లు చూసుకున్న ఆ వెయిటర్ ఒక్కసారిగా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు.ఆ టిప్ చూసిన అతడికి ఒక్కసారిగా ఆనందం తెంచుకురావడం తో గట్టిగా అరిచాడు.అసలుకే గత కొద్దీ రోజులుగా లాక్ డౌన్ కారణంగా విధులకు హాజరు కాని ఆ వెయిటర్ కు ఒక్కసారిగా అంతమొత్తం టిప్ గా దొరికేటప్పటికి అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

నిజంగా ఎవరైనా రెస్టారెంట్ కు వెళితే ఏ రూ.10 లేదంటే మహా అయితే రూ.50 ఇవ్వడానికి చూస్తూ ఉంటారు.అలాంటిది బిల్లు కంటే కూడా భారీ మొత్తం ఆ వెయిటర్ కు టిప్ దొరకడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

#Social Media #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Waiter Tip Goes Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..