'ఆర్‌ఆర్‌ఆర్‌'కు వేలల్లో వస్తున్న టైటిల్స్‌... వీటిలో ఏది ఫైనల్‌ అయ్యేనో?  

Waht Is Final Title For Rajamouli Rrr Movie-rajamouli,ram Charan,rrr Movie Budget,rrr Movie Final Title

టాలీవుడ్‌ జక్కన్న ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ఈయన తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ను అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంపిక చేయవచ్చు అంటూ రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే..

'ఆర్‌ఆర్‌ఆర్‌'కు వేలల్లో వస్తున్న టైటిల్స్‌... వీటిలో ఏది ఫైనల్‌ అయ్యేనో?-Waht Is Final Title For Rajamouli RRR Movie

మూడు ఆర్‌ లకు సంబంధించన ఫుల్‌ ఫామ్‌ను క్రియేటివ్‌గా ఆలోచించి మాకు పంపించాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో టైటిల్స్‌ను పోస్ట్‌ చేయాలని సూచించిన వెంటనే భారీ ఎత్తున టైటిల్స్‌ వెళ్లువెత్తాయి. కొందరు ఫన్నీగా పంపుతుంటే మరి కొందరు సీరియస్‌గా పంపుతున్నారు.

కొందరు తెలుగులో టైటిల్స్‌ ఇస్తుంటే మరి కొందరు ఇంగ్లీష్‌ టైటిల్స్‌, హిందీ టైటిల్స్‌ ఇస్తున్నారు. మొత్తానికి వేలల్లో టైటిల్స్‌ వస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఒక టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తమ దృష్టికి కొన్ని వచ్చాయని, వాటికి తోడు ఇంకా క్రియేటివ్‌గా, ఆకట్టుకునే విధంగా ఉంటే తప్పకుండా పరిశీలిస్తామని జక్కన్న ప్రకటించాడు.

వచ్చే ఏడాది జులై 30వ తారీకున విడుదల కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే కోల్‌కత్తాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణకు వెళ్లబోతున్నట్లుగా జక్కన్న ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. తెలుగు సినిమా స్థాయిని జక్కన్న మరోసారి ఈ చిత్రంతో ప్రపంచానికి చాటడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.