గట్టిగా కొడతానంటోన్న శీనయ్య.. హీరోగా కాదు బాసు!  

Vv Vinayk Seenayya - Telugu Director, Script, Seenayya, Tollywood News, Vv Vinayk

ఒకప్పుడు మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా దర్శకుడు వివి వినాయక్ నిలిచే వాడంటే ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఎలా ఉండేవో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.కాగా ఈ డైరెక్టర్ వరుసబెట్టి మాస్ చిత్రాలకు కమర్షియల్ సక్సెస్ అందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

 Vv Vinayk Seenayya

అయితే క్రమంగా వివి వినాయక్ చిత్రాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తుండటంతో చేతిలో పెద్దగా సినిమా ఛాన్సులు లేకుండా పోయాడు ఈ డైరెక్టర్.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వినాయక్ ఏకంగా హీరోగా మారేందుకు రెడీ అయ్యాడు.

గట్టిగా కొడతానంటోన్న శీనయ్య.. హీరోగా కాదు బాసు-Gossips-Telugu Tollywood Photo Image

ఈ మేరకు శీనయ్య అనే సినిమా తొలి షెడ్యూల్‌ను కూడా ప్రారంభించిన వినాయక్ హీరోగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూశారు.కానీ ఈ సినిమా తొలి షెడ్యూల్‌కే శుభం కార్డు వేసుకుంది.

ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమాపై నమ్మకం లేకపోవడంతో అక్కడికే ముగించేశాడు.దీంతో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.

ఇక ఇప్పుడు దర్శకుడిగా తన సత్తాను మళ్లీ నిరూపించుకునేందుకు వివి వినాయక్ రెడీ అవుతున్నాడు.దీని కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఈ కథతో మళ్లీ తనలోని పాత దర్శకుడిని నిద్రలేపాలని చూస్తున్నాడు వినాయక్.మరి వినాయక్ డైరెక్టర్‌గా ఇప్పుడు సినిమాను తెరకెక్కించేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తాడా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఇక ఈ సబ్జెక్టుకు హీరో ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vv Vinayk Seenayya Related Telugu News,Photos/Pics,Images..

footer-test