పెళ్లి చేసుకొని ఏం పీకాలి అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!  

vv vinayak sensational comments about marriage VV Vinayak, Tollywood Director, Chennakeshavareddy, Sai Dharam Tej, Intilegent, VV Vinayak Marriage News, Dill Raju, - Telugu Dill Raju, Sai Dharam Tej, Tollywood Director, Vv Vinayak

టాలీవుడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ వి వి వినాయక్ తెరకెక్కించే సినిమాల శైలి భిన్నంగా ఉంటుంది.సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకునే ఈ డైరెక్టర్ గత కొన్నేళ్ల నుంచి కామెడీతో కూడిన మాస్ సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

TeluguStop.com - Vv Vinayak Sensational Comments About Marriage

దిల్ రాజు నిర్మాతగా వి వి వినాయక్ హీరోగా ఒక సినిమా కూడా కొన్ని నెలల క్రితం మొదలైంది.అయితే ఆ సినిమా రిలీజ్ అవుతుందో లేదోనంటున్న వి వి వినాయక్ తనకు పెళ్లికి ముందు జరిగిన ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన ఇంట్లో అందరూ నాని అని పిలుస్తారని ఇంట్లో తనను నాన్న అలాగే పిలుస్తారని చెప్పారు.వివి వినాయక్ అంటే వరుస విజయాల వినాయక్ అని అభిమానులు ప్రేమతో తన ఇంటి పేరును అలా పిలుస్తారని చెప్పారు.

TeluguStop.com - పెళ్లి చేసుకొని ఏం పీకాలి అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాను హీరోగా మారడానికి దిల్ రాజు కారణమని సినిమాలో యాక్ట్ చేస్తే బరువు తగ్గవచ్చని అనుకుని తాను ఆ సినిమాకు అంగీకరించానని తెలిపారు.చెన్నకేశవరెడ్డి సినిమాలో సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్ అయిందని తెలిపారు.

ఆ సినిమా మరో సినిమాలా ఉంటుందని కొందరు చెబుతారని అన్నారు, తనకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని అయితే సినిమాల్లోకి వెళితే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వరని నాన్న భయపడేవాడని అప్పుడు తాను పెళ్లి ఇప్పుడు అంత అవసరమా.? పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా.? పెళ్లి చేసుకొని ఏం పీకాలి.? అని తన తండ్రితో దెబ్బలాడానని వినాయక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆది సినిమా షూటింగ్ సమయంలో తారక్ చేతికి గాయమైందని.రక్తం కారిందని.ఆ సమయంలో భయమేసిందని అన్నారు.ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వినాయక్ కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి.

వినాయక్ చివరగా సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటెలిజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

#Sai Dharam Tej #Dill Raju #VV Vinayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vv Vinayak Sensational Comments About Marriage Related Telugu News,Photos/Pics,Images..