అఖిల్ సినిమా దాదాపుగా 30 కోట్లు నష్టపోవడంతో పంపిణిదారులంతా నితిన్, వినాయక్ లకు ఫోన్ల మీద ఫోన్లు చేసి తమ బాధలు మొరపెట్టుకున్నారు.నితిన్ వాళ్ళ కష్టాలను ఏరకంగా తీర్చాడో తెలియదు కాని, వినాయక్ మాత్రం కొంతమంది డిస్ట్రీబ్యూటర్స్ కి నష్టపరిహారం చెల్లించినట్లు అన్నారు.
వినాయక్ మంచితనాన్ని అందరు మెచ్చుకున్నా, ఇప్పుడు ఆ మంచితనమే వినాయక్ కొంప ముంచింది.
నిజమో, గాలివార్తో తెలియదు కాని ఆఖిల్ దెబ్బకు వినాయక్ తన ఇల్లు అమ్ముకుంటున్నారనే వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.20 కోట్ల రూపాయలకు వినాయక్ ఇల్లు కొనేందుకు ఒక బయ్యర్ ముందుకు వచ్చాడని సమాచారం.ఇదే నిజమైతే అఖిల్ సినిమా వలన హీరో,నిర్మాత కన్నా ఎక్కువ నష్టపోయింది వినాయకే అని చెప్పాలి.
ఎలాగో మెగాస్టార్ చిరంజీవితో కత్తి రిమేక్ చేతిలో ఉండంటంతో ఆర్థికంగా మరీ దారుణమైన పరిస్థితి వినాయక్ ఎదురుకోకపోవచ్చు.ఆ సినిమా అయినా మంచి సక్సెస్ సాధించి వినాయక్ పరిస్థితులను చక్కబెట్టాలి.