హమ్మయ్య.. ఎట్టకేలకు మొదలుపెడుతున్న సీనయ్య!  

Vv Vinayak Seenayya To Go On Floors On Jan 27-shooting,telugu Movie News,tollywood Updates,vv Vinayak

మాస్ చిత్రాలతో వరుసబెట్టి సక్సెస్‌లు అందుకున్న దర్శకుడు వివి వినాయక్ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు.డైరెక్టర్‌గా గతకొంత కాలంగా వరుస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్న వివి వినాయక్ తన పంథా మార్చుకుని మొహానికి మేకప్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు.

VV Vinayak Seenayya To Go On Floors Jan 27-Shooting Telugu Movie News Tollywood Updates Vv

వినాయక్ త్వరలో ఓ సినిమాలో హీరోగా నటిస్తాడనే వార్త గతకొంత కాలంగా ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

కాగా వివి వినాయక్ నటించబోయే సినిమాకు టైటిల్ ‘సీనయ్య’ అని చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా కోసం వినాయక్ ఇప్పటికే తన గెటప్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 27 నుంచి నిరవధికంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా నరసింహా నంది డైరెక్ట్ చేస్తుండగా 90ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వినాయక్ ఓ మెకానిక్‌గా కనిపిస్తాడట.ఇక ఈ సినిమాలో వినాయక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.

తాజా వార్తలు

Vv Vinayak Seenayya To Go On Floors On Jan 27-shooting,telugu Movie News,tollywood Updates,vv Vinayak Related....