దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ తాజాగా ఉగాది కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ పోస్టర్లో తారక్, చరణ్‌ల మొహాలు స్పష్టంగా కనిపించలేదు కానీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసింది ఈ మోషన్ పోస్టర్.
ఇక ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అనే సందేహం అందరిలో నెలకొంది.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగోను చూసి సినిమా కథేమిటో చెప్పేశాడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్.
ఈ సినిమా టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ ద్వారా సినిమా కథను ఆయన విడమర్చి చెప్పారు.బ్రిటిష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్న రౌద్రం(కోపం), ఆ ఇద్దరు కలిసి చేయాలనుకన్న రణం(యుద్ధం), ఆ యుద్ధంలో వాళ్లర్పించిన రుధిరం(రక్తం) అంటూ వినాయక్ ట్వీట్ చేశాడు.
మొత్తానికి సినిమా టైటిల్‌తోనే కథను అల్లేసిన వినాయక్‌కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా జనవరి 8, 2021లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.