‘లూసీఫర్‌’ను వదిలేయలేదట  

VV Vinayak Not to Left The Lucifar Remake Movie, vv Vinayak, Lucifar, Khaidhi Number 150, Chiranjeevi, Sujith - Telugu @kchirutweets, Chiranjeevi, Khaidhi Number 150, Lucifar, Sujith, Vv Vinayak

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆధరించారు.అందుకే ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆశ పడ్డాడు.

TeluguStop.com - Vv Vinayak Not To Left The Lucifar Remake Movie

ఆయన ఈ సినిమా రీమేక్‌ బాధ్యతలను సాహో దర్శకుడు సుజీత్‌కు ఇచ్చాడు.అయితే ఆ సినిమా కోసం కథను కాస్త విభిన్నంగా రాసి మెగాస్టార్‌ ముందుకు తీసుకు వెళ్లాడు.

అది చిరంజీవికి నచ్చక పోవడంతో దర్శకుడు సుజీత్‌ ను ప్రాజెక్ట్‌ నుండి పక్కకు పంపించినట్లుగా తెలుస్తోంది.ఆ సమయంలోనే వివి వినాయక్‌ కు చిరు నుండి పిలుపు వచ్చింది.

TeluguStop.com - లూసీఫర్‌’ను వదిలేయలేదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినిమా రీమేక్‌ బాద్యతలు తీసుకోవాల్సిందిగా వినాయక్‌ కు చిరంజీవి సూచించాడని కూడా వార్తలు వచ్చాయి.ఆ విషయం పక్కన పెడితే ఇటీవల సినిమా క్యాన్సల్‌ అయ్యింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ గతంలో చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాలు ఠాగూర్‌ మరియు ఖైదీ నెం.150 సినిమాలకు దర్శకత్వం వహించాడు.ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఖచ్చితంగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా వినాయక్‌కు ఇస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు.

చిరంజీవితో రీమేక్‌ లు చేసి రికార్డు సృష్టించిన వినాయక్‌ మరో సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.విలన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నారు.ఒరిజినల్‌ వర్షన్‌లో వివేక్‌ ఒబేరాయ్‌ నటించగా తెలుగులో ఆ పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అంటూ ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్యలో నటిస్తుండగా తదుపరి వేదాలం రీమేక్‌ చేస్తాడట.ఆ తర్వాత లూసీఫర్‌ రీమేక్‌ పై శ్రద్ద పెట్టబోతున్నాడు.

#@KChiruTweets #Sujith #Lucifar #Chiranjeevi #VV Vinayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vv Vinayak Not To Left The Lucifar Remake Movie Related Telugu News,Photos/Pics,Images..