బాలయ్యను లైన్‌లో పెడుతున్న మాస్ డైరెక్టర్?  

VV Vinayak Next Movie With Balakrishna, Balakrishna, VV Vinayak, BB3, Boyapati Sreenu, Tollywood News - Telugu Balakrishna, Bb3, Boyapati Sreenu, Tollywood News, Vv Vinayak

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన చిత్ర యూనిట్, కరోనా.

TeluguStop.com - Vv Vinayak Next Movie With Balakrishna

కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.ఈ సినిమాను.

తనదైన మార్క్‌లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు బాలయ్య ఓకే అన్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న ఈ కాంబోలో మరో సినిమా రానుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - బాలయ్యను లైన్‌లో పెడుతున్న మాస్ డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే మరో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో బాలయ్య మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాలయ్యకు చెన్నకేశవరెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వినాయక్, ప్రస్తుతం సరైన ఫాంలో లేకపోవడంతో, ఆయన తిరిగి సక్సె్స్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత బాలయ్యతో ఓ సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

అయితే వినాయక్ ఈసారి బాలయ్య కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఫాంలో లేని వినాయక్ సక్సెస్ ట్రాక్ ఎక్కగలడా లేడా అనేది ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#VV Vinayak #Balakrishna #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vv Vinayak Next Movie With Balakrishna Related Telugu News,Photos/Pics,Images..