వినాయక్ వైరల్ లుక్  

Vv Vinayak New Look-

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వివి.వినాయక్ సరికొత్త దర్శనమిచ్చాడు.వెండితెర వెనుక నుండి ఇన్నాళ్లు తన యాక్షన్ డోస్ ని చూపించిన వినాయక్ ఇప్పుడు తెరపై డైరెక్ట్ గా తన నటనతో సరికొత్త కిక్కు ఇవ్వనున్నాడు...

Vv Vinayak New Look--VV Vinayak New Look-

దిల్ రాజు ప్రొడక్షన్ లో వినాయక్ ఒక సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Vv Vinayak New Look--VV Vinayak New Look-

అయితే ఆ సినిమా కోసం ఈ సీనియర్ దర్శకుడు గత కొంత కాలంగా జిమ్ లో తీరిక లేకుండా కష్టపడుతున్నాడు.పాత్ర కోసం ఫిట్ నెస్ లో ఊహించని మార్పులు చేశాడు.ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టులో వినాయక్ రెండు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తాడని సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో వేరు వేరు స్వభావాలు కలిగి ఉంటాడట..

అందుకే పాత్రకు న్యాయం చేయడం కోసం మొదటిసారి ఓ దర్శకుడి ఊహలకు ప్రాణం పోస్తున్నాడు.మరి ఆ పాత్ర ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.