లూసీఫర్‌ కు ముందే శీనయ్యను ముగించే ప్రయత్నం  

vv vinayak going to finish seenaiah movie soon Lucifar, Seenaiah, Dill Raju, Chiranjeevi, Acharya, 8 Months Shooting Break, Coronavirus, Lock Down - Telugu 8 Months Shooting Break, Acharya, Chiranjeevi, Coronavirus, Dill Raju, Lock Down, Lucifar, Seenaiah, Vv Vinayak Going To Finish Seenaiah Movie Soon

యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దర్శకుడు వివి వినాయక్‌ నటుడిగా శీనయ్య అనే సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.హీరోగా పరిచయం అయ్యేందుకు వినాయక్‌ రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

TeluguStop.com - Vv Vinayak Going To Finish Seenaiah Movie Soon

దిల్‌ రాజు ప్రత్యేక శ్రద్ద కనబర్చి వినాయక్‌ ను నటుడిగా పరిచయం చేయాలని భావించాడు.శీనయ్య అనే సినిమాను పట్టాలెక్కించి వినాయ్‌ కు మంచి లైఫ్‌ ఇవ్వాలని దిల్‌ రాజు ఆశ పడ్డాడు.

కాని అనివార్య కారణాల వల్ల గత ఏడాది నుండి ఆ సినిమా ఒక్క రోజు షూటింగ్‌ జరుపుకుని రెండు రోజులు వాయిదా అన్నట్లుగా జరిగింది.కథ సరిగా లేదని అనేక మార్పులు చేర్పులు చేసిన యూనిట్‌ సభ్యులు చివరకు ఏదోలా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకున్న సమయంలో కరోనా వచ్చింది.

TeluguStop.com - లూసీఫర్‌ కు ముందే శీనయ్యను ముగించే ప్రయత్నం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాంతో ఎనిమిది నెలలుగా షూటింగ్‌ ఆగిపోయాయి.మళ్లీ శీనయ్యకు సంబంధించిన చిత్రీకరణ గురించిన చర్చ మొదలైంది.

శీనయ్య సినిమా షూటింగ్‌ విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.త్వరలో చిరంజీవితో వినాయక్‌ లూసీఫర్‌ రీమేక్‌ను చేయబోతున్నాడు.అంతకు ముందే శీనయ్యను ఏదోలా పూర్తి చేసి విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారు.ప్రస్తుతం సినిమా కుసంబంధించి స్క్రిప్ట్‌ చర్చలు జరుగుతున్నాయట.

ఇప్పటికే షూట్‌ చేసినదాన్ని కూడా కొంత మళ్లీ రీ షూట్‌ చేయాలనే విషయమై చర్చ జరిగిందట.మొత్తానికి వచ్చే సమ్మర్‌ లో లూసీఫర్‌ రీమేక్‌ షూటింగ్‌ మొదలు కాబోతుంది.

అంతకు ముందే శీనయ్యను పూర్తి చేసి వినాయక్‌ ను నటుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చ ఉద్దేశ్యంతో నిర్మాత దిల్‌ రాజు ఉన్నాడట.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ విషయమై అధికారికంగా ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

శీనయ్య లో వినాయక్‌ మెకానిక్‌ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

#Coronavirus #Lock Down #Seenaiah #Chiranjeevi #8Months

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vv Vinayak Going To Finish Seenaiah Movie Soon Related Telugu News,Photos/Pics,Images..