క్షమాపణ చెప్పినా వేటు వేశారు

కృష్ణ జిల్లా ఉయ్యూరులో ఈ నెల 24 వ తేదీన 16 బ్యాంకు ల ముందు చెత్తను వేసి డంపింగ్ యార్డ్ గా మార్చారు.ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వంపై మున్సిపల్ అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు.

 Vuyyuru Municipal Commissioner Prakash Rao Suspended, Uyyuru  Ap Politics, Viral-TeluguStop.com

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ అధికారులు పలువురు రాష్ట్ర మంత్రులపై సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం.అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలు మంజూరు చెయ్యలేదనే కోపంతోనే ఇలా చేశారు అని తెలుస్తుంది.

ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ డా.ప్రకాశరావు పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ఈ విషయంపై వెంటనే సంబందిత అధికారులతో చర్చించన తర్వాత డా.ప్రకాశరావును సస్పెండ్ చేశారు.ఆయన క్షమాపణ చెప్పిన కొద్ది నిమిషాలలోనే సస్పెండ్ చేశారు.ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్  ఉత్తరువ్వులను జారీచేశాడు.ఈ విషయంపై బ్యాంకు, అధికారులను, సిబ్బందిని క్షమాపణ కోరాడు.ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పథకాలను బ్యాంకుల సహాయంతో ముందుకు తీసుకువెళ్లాలిసిన బాధ్యత నగర పంచాయతీ వర్గాలకు ఉందని గుర్తుచేశాడు.

బ్యాంకుల ముందు చెత్తవేసిన వారిపై అంతర్గత విచారణ చేబడతాం అన్నారు.అలాగే కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటన మరల పునరావృతం కాకుండా చూసుకుంటాంని హామీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube