రామోజీ రావు మీద ఉండవల్లి ఫైట్ - పద్మం గురించే !

తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గన్న ఎడిటర్ గా రామోజీరావు మంచి స్థాయి లో ఉన్నారు.మార్గదర్శి ఎపిసోడ్ విషయం పక్కన పెడితే మిగతా అంతా ఆయనకీ క్లీన్ షీట్ ఉండనే ఉంది.

 Vundavalli Fight On Ramoji!-TeluguStop.com

అయితే వై ఎస్ జమానా లో మార్గదర్శి ఎపిసోడ్ లో ఉండవల్లి తో కలిసి వై ఎస్సార్ ఆడిన ఆట రామోజీరావు కి చెమటలు పట్టించింది.ఎవరి చేతా ఎప్పుడూ వేలెత్తి చూపించుకునే అవకాశం ఇవ్వని రామోజీ.

మార్గదర్శి ఇష్యూలో నోటి వెంట మాట రాని పరిస్థితి.అయితే.

ఆ ఇష్యూను డీల్ చేసేందుకు తన శక్తియుక్తుల్ని మొత్తాన్ని సమీకరించి తానేంటో చెప్పే ప్రయత్నం రామోజీ చేస్తే.ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఏమిటన్నది బయటపడింది.

ఏదైనా ఆర్ధిక సంస్థ పరిస్థితి బాలేదు అని పుకారు ఒచ్చినా కస్టమర్ లు గోల చేస్తారు కానీ మార్గదర్శి విషయం లో అలా జరగలేదు, అప్పట్లో ప్రభుత్వమే రామోజీ కి ఎదురు వెళ్ళినా ప్రజలు ఆయన మీద నమ్మకంతో సైలెంట్ గా ఉన్నారు.అప్పట్లో మార్గదర్శి కస్టమర్ లకి డబ్బు వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి కూడా ఒచ్చింది.

ఈ పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పకనే చెప్పాలి.వై ఎస్ కనుసైగల తో కథంతా నడిపించి రామోజీ తో మూడు చెరువుల నీళ్ళు తాగించారు ఉండవల్లి.

ఇప్పుడు రామోజీ కి దేశం లోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ రావడం లో ఆయన మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారు.తాజాగా.

ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు మీద ఒక పిల్ ను హైకోర్టులో దాఖలు చేశారు.రామోజీకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించటాన్ని ప్రశ్నిస్తూ.

ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేయటం ఆసక్తికరంగా మారింది.ఈ పిల్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి.

ఏపీ.తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శలు.వ్యక్తిగత హోదాలో రామోజీరావును ప్రతివాదులుగా చేర్చారు.ముగిసిందనుకున్న వార్.తాజా పిల్ తో ఇరువురి మధ్య మళ్లీ షురూ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube