20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ దర్శనం ఇచ్చిన అరుదైన రాబందు  

20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో కనిపించిన రాబందు.

Vulture Spotted After 20 Years In Hyderabad-

హైదరాబాద్ ఒకప్పుడు అటవీప్రాంతం అనే విషయం అందరికి తెలిసిందే.ఆ సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల రాబందులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి అయితే కాలక్రమంలో హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో రాబందులు కూడా పూర్తిగా అంతరించిపోయాయి.ఇక ఈ కాంక్రీట్ జంగిల్స్ ప్రపంచంలో కనుచూపు మేరలో కనీసం పక్షులు కూడా కనిపించడం లేదు..

Vulture Spotted After 20 Years In Hyderabad--Vulture Spotted After 20 Years In Hyderabad-

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో 20 ఏళ్ల తర్వాత రాబందు కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆసిఫ్ నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ రాబందు ఉందని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని పట్టుకొని జూకి తరలించారు.1999లో హయత్ నగర్ అటవీ ప్రాంతం కనిపించిన ఈ తెల్ల రాబందులు తరువాత కనిపించలేదు.అవి అంతరించిపోయాయనే అందరూ భావించారు.అయితే ఇంత కాలం తర్వాత మరల ఇప్పుడు కనిపించడం విశేషం.

ఇక ఈ రాబందు చిక్కి శల్యంమై నీరసించి ఉంది.దీంతో కాస్తా సపర్యలు చేసిన అనంతరం రాబందు కొద్దిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.