తిక్కకుదిరింది : రైల్వేశాఖ తప్పు ఎత్తి చూపాలని ప్రయత్నించి తనకు తానే పరువు తీసుకున్నాడు

కొన్ని సార్లు ఇతరులను వేలెత్తి చూపించే సమయంలో మన పరువు మనం తీసుకున్నట్లవుతుంది.అందుకే ఒకరి వైపు వేలు ఎత్తి చూపే సమయంలో ఇతరుల వేళ్లు మనవైపు తిప్పి చూపించే అవకాశం ఉందా అనే విషయాన్ని మనకు మనం ఆలోచించుకోవాలి.

 Vulgar Ads On Irctc App Savage Reply From Indian Railway-TeluguStop.com

అలా ఆలోచించగలిగే వ్యక్తి ఇతరులను వేలెత్తి చూపించరు.ఇతరుల తప్పులను దొరికించుకుని వారిని విమర్శించేందుకు ప్రయత్నిస్తే మన తప్పులను మరో వ్యక్తి దొరికించుకుంటాడనే విషయం మనం గుర్తించాలి.

తాజాగా ఒక ఇండియన్‌ రైల్వే యూజర్‌ ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన మన రైల్వేస్‌ను తప్పుబట్టేందుకు ప్రయత్నించి తన పరువే తీసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్‌ను వినియోగిస్తున్నాడట.

ఆయన టికెట్లను బుక్‌ చేసుకోవడం, ఇతర వివరాలను చెక్‌ చేసుకుంటున్న సమయంలో కొన్ని యాడ్స్‌ వస్తున్నాయట.బూతు యాడ్స్‌ ఇతర అశ్లీల సైట్లకు సంబంధించిన యాడ్స్‌ వస్తున్నట్లుగా అతడు పేర్కొనానడు.

ఆ యాడ్స్‌ వల్ల అతడు చాలా చిరాకు పడుతున్నట్లుగా సోషల్‌ మీడియా వేదిక అయిన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.అదే సమయంలో ఇండియన్‌ రైల్వేస్‌ మరియు ఐఆర్‌సీటీసీని ట్యాగ్‌ చేయడం జరిగింది.

దాంతో కొందరు ఇండియన్‌ రైల్వేస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిక్కకుదిరింది : రైల్వేశాఖ తప

ఆనంద్‌ కుమార్‌ ట్వీట్‌పై ఇండియన్‌ రైల్వేస్‌ ఐటీ టెక్నికల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్నెట్‌ గురించిన సరైన అవగాహణ లేకుండా మాట్లాడవద్దని సూచించారు.మీరు మీ మొబైల్‌లో ఎలాంటి సైట్లను ఓపెన్‌ చేస్తారో వాటి హిస్టరీ మరియు కుకీస్‌ను మొబైల్‌ దాచి ఉంచి, ఇతర యాప్స్‌కు వాటిని వినియోగించుకునే అవకాశం ఇస్తుంది.

అలాంటప్పుడు మీ మొబైల్‌ ఐఆర్‌సీటీసీ యాప్‌లో అశ్లీల లింక్స్‌ వస్తున్నాయని చెప్పడం జరిగింది.అంటే మీరు గతంలో ఆ అశ్లీల సైట్లను ఓపెన్‌ చేసి ఉంటారు.దాంతో మైండ్‌ బ్లాక్‌ అయినా ఆనంద్‌ కుమార్‌ తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.కనీస అవగాణ లేకపోవడంతో పాటు, అత్యంత చిల్లర వ్యవహారంగా పేర్కొన్నారు.

ఆనంద్‌ కుమార్‌ ట్వీట్‌పై పలువురు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.దాంతో ఆయన పరువు పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube