VT10 వచ్చేస్తోంది మరి VD10 పరిస్థితి ఏంటీ?

వరుణ్‌ తేజ్ 10వ సినిమా బాక్సింగ్‌ ఫస్ట్‌ లుక్‌ కు రంగం సిద్దం అయ్యింది.కిరణ్ కొర్ర పాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.

 Vt10 వచ్చేస్తోంది మరి Vd10 పరిస్థి-TeluguStop.com

ఆ సినిమాలో వరుణ్‌ ఫైటర్ గా కనిపించబోతున్నాడు.బాక్సర్‌ అనే టైటిల్‌ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

కాని సినిమా ఫస్ట్‌ లుక్‌ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది.

ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సమయంలో విజయ్‌ దేవరకొండ సినిమా గురించిన చర్చ మొదలు అయ్యింది.

ఎప్పుడెప్పుడు విజయ్‌ దేవరకొండ మూవీ షూటింగ్‌ పునః ప్రారంభం అవుతుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Puri Jaganadh, Telugu, Tollywood, Vd-Movie

రికార్డు బ్రేకింగ్‌ ఖాయం అంటూ మొదలు అయిన విజయ్‌ దేవరకొండ 10వ సినిమా ఫైటర్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌ చర్చనీయాంశంగా ఉంది.పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా గత ఏడాది ఆరంభంలో ప్రకటించారు.సినిమా షూటింగ్ కు మార్చిలో కరోనా కారణంగా పేకప్‌ చెప్పారు.

మళ్లీ ఇన్నాళ్ల వరకు కూడా సోషల్‌ మీడియాలో సినిమా గురించి చర్చ జరుగుతుంది కాని సినిమా షూటింగ్‌ మాత్రం పునః ప్రారంభం అవ్వడం లేదు.కరోనా భయం మరిచి పోయి స్టార్స్‌ అంతా కూడా షూటింగ్‌ మొదలు పెట్టారు.

మరి విజయ్‌ దేవరకొండ మాత్రం ఆలస్యం చేస్తున్నాడు.పూరి జగన్నాద్‌ ఎందుకు మరీ ఇంత ఆలస్యం చేస్తున్నాడో అర్థం అవ్వడం లేదు అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎవ్వరికి లేని కరోనా వీరికి మాత్రమే ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం జనాలు ఈ సినిమా గురించి మర్చి పోయే వరకు ఇలాగే చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube