2018 వృషభ రాశి వారికి అవమానం ఎక్కువగా ఉంటుందా? మరి రాజపూజ్యం?  

Vrushabha Rasi Phalalu -

ఉగాది వస్తుందంటే ప్రతి ఒక్కరు తమ జాతకం ఎలా ఉందో చూసుకోవటానికి ఉత్సాహం చూపుతూ ఉంటారు.జ్యోతిషులు పుట్టిన గ్రహ స్థితి బట్టి వారి జన్మ రాశి అలాగే నక్షత్రం బట్టి జాతకం చెప్పుతూ ఉంటారు.

ఈ రోజుల్లో జాతకాలను నమ్మే వారు ఉన్నారు.నమ్మని వారు ఉన్నారు.

TeluguStop.com - Vrushabha Rasi Phalalu-Devotional-Telugu Tollywood Photo Image

ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఈ రాశి వారికీ ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 1, అవమానం: 3 ఉంటుంది.ఈ సంవత్సరం ఉద్యోగం అయిన వ్యాపారం అయినా ఈ రాశి వారికీ చాలా అభివృద్ధి ఉంటుంది.కొన్ని ఇబ్బందులు,అడ్డంకులు ఎదురు అయినా దైర్యంగా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు.ఈ సంవత్సరం శని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది.అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

వీరికి అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది.వీరి చర్మ ఛాయ నల్లగా ఉన్నప్పటికీ వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.వీరు వ్యాపారరంగంలో బాగా రాణిస్తారు.రియల్ ఎస్టేట్ రంగం అయితే మంచి లాభాలు వస్తాయి.

వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురు అయినా చాకచక్యంతో బయట పడతారు.

వీరికి ఎక్కువ శ్రమ పడితేనే డబ్బులు చేతికి వస్తాయి.

వీరు ఎంత సంపాదించిన వీరి చేతిలో డబ్బు నిలవదు.అందువల్ల సంపాదించినా డబ్భును వీరు ఖర్చు చేయకుండా ఉంటేనే మంచిది.

ఈ రాశి వారికి ధృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి అధికంగా ఉంటాయి.వీరు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు.

ఈ రాశి వారికి ప్రేమ కూడా కాస్త ఎక్కువే.కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు.వీరు పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవటం వంటి విషయాలలో సంతోషాన్ని వెతుక్కుంటారు.వృషభరాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు.

వీరి దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యిపోతూ ఉంటాయి.

వీరు కాస్త బద్దకస్తులు,మొండితనం ఎక్కువ,కోపం కూడా ఎక్కువే.అలాగే వీరు సొంత నిర్ణయాలను తీసుకోలేరు.

మరొకరి మీద ఆధారాపడి ఉంటాడు.

వీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.వీరు కుటుంబం కోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తారు.

వీరు బుధవారం, శనివారం,శుక్రవారం పనులను ప్రారంభిస్తే మంచి జరుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube
related-posts postSearchKey=Vrushabha Rasi Phalalu - -2018 వృషభ రాశి వారికి అవమానం ఎక్కువగా ఉంటుందా? మరి రాజపూజ్యం?

Vrushabha Rasi Phalalu Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL