అన్ని రాశుల్లో బలమైన వృశ్చికరాశి వారి జీవితం ఎలా ఉంటుంది   Vruschika (Scorpion) Rasi Phalithalu     2017-10-30   21:58:27  IST  Raghu V

సాధారణంగా వృశ్చికరాశి వారు కొంచెం ముభావంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిని అంచనా వేస్తూ ఉంటారు. ఈ రాశి వారు తొందరగా ఎవరిని నమ్మరు. ఒక్కసారి నమ్మరంటే గాఢంగా నమ్ముతారు.

ఈ రాశి వారికీ ఎదో చేయాలన్న తపన అంకితభావం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసిన మానసిక బంధంతో చేయటం వలన అద్భుతంగా ఉంటుంది.

వీరికి పోరాట తత్త్వం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఓటమి అనేదే ఉండదు. విజయం సాధించటంలో ఆలస్యం,కష్టం ఉన్నా సరే సాధించే వరకు కష్టపడతారు.

వీరిలో స్వతంత్ర భావాలూ ఎక్కువగా ఉండుట వలన ఏ పనికి ఇతరుల మీద ఆధారపడరు. వారు చేసుకున్న పని మాత్రమే వారికీ సంతృప్తిని ఇస్తుంది.

వృశ్చికరాశివారు స్వభావసిద్ధంగా నాయకులు. ఎలాంటి బాధ్యతైనా,ఎటువంటి సమస్య అయినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. రాబోయే కష్టాలను నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటారు కాబట్టి వారిది చాలా బలమైన రాశి కూడా అయింది.


ఈ రాశివారు చాలా నమ్మకస్తులు. ముఖ్యంగా స్నేహితుల విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఏ సమయంలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా వారు మీకోసం సిద్ధంగా ఉంటారు. కానీ వారి వద్ద నుంచి ఆ నమ్మకం, స్నేహం పొందటానికి వారితో ముందు చాలా సమయాన్ని గడపాలి.

వృశ్చికరాశివారికి చాలా సహజంగా, స్వభావసిద్ధంగా హాస్యచతురత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారి సమక్షంలో ఎవరూ బోర్ ఫీలవరు, పైగా వారిని వదిలి వెళ్ళటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

వారు జీవితంలో విజయవంతం కావటానికి అంచనాశక్తి అమోఘంగా ఉండటమే ముఖ్యకారణం. వారి అంచనాలు చాలా శక్తివంతంగా, సరిగ్గా ఉంటాయి. దాదాపుగా అన్ని అంచనాలు సరిగానే అవటంతో, వారు సులభంగా ఓడిపోరు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.