వృద్ధుడి ఫించన్ ను కొట్టేసిన వాలంటీర్..!

ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న ఫించన్ ను కొందరు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు కాజేస్తున్నారు.వృద్ధులకు ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం అందించే వృద్ధాప్య ఫించన్ ను కూడా వదలడం లేదు.

 Kurnool Village Voulnteer Old Man Pension, Pension, Kurnool, Police Complaint-TeluguStop.com

ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.<\br>

తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వృద్ధుడి ఫించన్ ను నొక్కేశాడు.

మద్దికెర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వాలంటీర్ ప్రవీణ్ ఫించన్ పంపిణీలో అవకతవకలు జరిపాడు.తప్పుడు లెక్కలు చూపి ఓ వృద్ధుడి పింఛన్ ను కాజేశాడు.

ఆ వృద్ధుడు ఎంపీడీఓకు నరసింహమూర్తికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టాడు.దీంతో తప్పుడు లెక్కలు కనిపించడంతో అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు అధికారులు.

<\br>

గ్రామ వాలంటీర్ రేషన్ కార్డుల మంజూరులో, పింఛన్ అందజేతలో అక్రమార్కులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ పేర్కొన్నాడు.ఇలాంటి ఘటనలు ఏదో ఓ చోట నెలకొంటున్నాయి.

దీంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అప్పట్లోనే హెచ్చరించారు.ఈ మేరకు అవినీతికి పాల్పడిన కొందరు అధికారులను సస్పెండ్ చేయగా.

మరికొందరిని పూర్తిగా విధులను బహిష్కరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube