గ్రేటర్ పోలింగ్ : మా ఓట్లు కనపడట్లేదు మొర్రో !!

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు ఉంది ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో జనాల పరిస్థితి, ఇవాళ అక్కడ మొదలైన జీ హెచ్ ఎం సి పోలింగ్ హైదరాబాద్ నగరం లో పండగ వాతావరణ నెలకొల్పింది.అన్ని స్కూల్స్ కాలేజీ లూ మూసేశారు.

 Votes Are Missing In Ghmc-TeluguStop.com

ప్రైవేటు తో పాటు పబ్లిక్ ఆఫీసులకి కూడా శలవలు ప్రకటించారు.

ఉదయం నుంచీ కొన్ని డివిజన్ లలో ఓటర్ల రద్దీ కనిపించగా మరి కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతోంది.

అయితే, కూకట్‌పల్లి సహా పలు డివిజన్లలో ఓట్ల తొలగింపు వ్యవహారం గందరగోళంగా మారింది.ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించి 60 ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటుకు హక్కుని వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రముఖులు పిలుపునిచ్చినా, వున్న ఓట్లనే వేయడానికి వీల్లేని పరిస్థితులుంటే, ఎలా ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఓట్లను కోల్పోయిన బాధితులు వాపోతున్నారు.

ముందస్తు వ్యూహం ప్రకారమే గ్రేటర్‌లో ఓట్ల తొలగింపు ప్రకియ జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube