ఎన్నారైలకి ఓటు హక్కు...దరఖాస్తుల స్వీకరణ

ఉన్నత చదువులకోసమే.ఉన్నతమైన ఉద్యోగాల కోసమో.

 Voter Registration For Nris Is Opened In Nvsp-TeluguStop.com

వ్యాపార సంభందాల కోసమో ఇలా ఎంతో మంది భారతీయులు ప్రపంచంలో పలు దేశాలలో స్థిరపడిపోయారు.అయితే ఎన్నికల సమయంలో కొంతమంది స్వదేశానికి తిరుగిరవాలి అంటే అది ఎంతో శ్రమతో కూడుకున్న విషయం పైగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

అయితే ఎన్నారైల ఓట్ల కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది.నేరుగా అక్కడినుంచీ ఓటు వేసుకోవచ్చు అయితే ఆ నమోదు ప్రక్రియ ఎలా ఉంది ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే.

ఎన్నారైలు ఓటు హక్కుని సద్వినియోయం చేసుకునేందుకు.జాతీయ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ దరఖాస్తులను స్వీకరిస్తోంది.ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950(ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్) ప్రకారం ఎవరైనా తమ సాధారణ నివాసంలో ఆరు నెలలకు పైగా లేనట్లయితే వారి పేరు ఓటరు జాబితా నుండి తొలగిస్తారు…ఈ లిస్టు లో ఎక్కువగా ఎన్నారైలు ఉంటారు అయితే…2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు ఇండియా లో ‘ఓవర్సీస్ ఎలక్టర్స్’ గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు…అది ఎలా అంటే

భారత ఎన్నారై ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎను ఆన్‌లైన్ నింపి తమ దరఖాస్తులను సమర్పించాలి.ఒక కలర్ ఫోటో (3.5 x 3.5 సైజు), పాస్‌పోర్టు, వీసా పేజీ కాపీలను అప్‌లోడ్ చేయాలి.దరఖాస్తు చేసిన తర్వాత భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు.ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కేవలం ఏడే రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు…అయితే ఎక్కడైనా చిన్న పొరపాటు గనుకా జరిగితే మాత్రం ఆయా దేశాలలో నివస్తిస్తున్న భారత రాయబార కార్యాలయానికి తెలిపుతారు.

ప్రవాసి ఓటర్లు గా వారు నేరుగా ఆ కార్యాలయానికి పోలింగ్ రోజున వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.అయితే ఎన్నారైలు మాత్రం ఆన్లైన్ విధానం ద్వారా ఓటు హక్కు వేసుకునే ప్రక్రియ ఉంటే బాగుంటుదని విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఎన్నికల నమోదు ప్రక్రియ ఎలా అంటే

ఇక్కడ ఇచ్చిన భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లింకు ను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది.ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి.

పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ(పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి.పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ-మెయిల్, ఇండియా మొబైల్ నెంబర్‌ను పేర్కొనాలి.

ఇండియాలోని చిరునామా(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నెంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/ పట్టణం, జిల్లా, పిన్ కోడ్ తెలియజేయాలి.

పాస్ పోర్ట్ నెంబరు, పాస్ పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా నెంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి.

ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కొరకా, విద్య కొరకా, లేదా ఇతర కారణాలా వివరించాలి.ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి.

విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ అనగా ఇంటి నెంబర్, వీధి, గ్రామం/ పట్టణము, రాష్ట్రం, దేశం, పిన్ కోడ్‌లను నమోదు చేయాలి.3.5 x 3.5 సైజు (పాస్ పోర్ట్ సైజు) గల కలర్ ఫోటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను జెపిజి(ఇమేజ్) ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube