ముదురుతున్న 'ఓటర్' వివాదం.... విష్ణు చెబుతున్న విషయంలో వాస్తవం లేదు అంటున్న డైరెక్టర్  

Voter Movie Director Allegations On Manchu Vishnu-

‘ఓటర్’ సినిమా వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం ‘ఓటర్’. ఈ చిత్రానికి కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విష్ణు కు, కార్తీక్ రెడ్డి కి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. దీనితో ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు..

ముదురుతున్న 'ఓటర్' వివాదం.... విష్ణు చెబుతున్న విషయంలో వాస్తవం లేదు అంటున్న డైరెక్టర్ -Voter Movie Director Allegations On Manchu Vishnu

అయితే ఈ చిత్రానికి నిర్మాత గా విష్ణు స్నేహితుడు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత,డైరెక్టర్ కు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. దీనితో తనకు హీరో మంచు విష్ణు నుంచి బెదిరింపులు వస్తున్నాయని డైరెక్టర్ ఆరోపించారు.

ఈ మేరకు కార్తీక్ రెడ్డి స్వయంగా ఒక వీడియో ను కూడా విడుదల చేసారు.

ఓటర్ సినిమా కోసం అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే,కథ కు కోటిన్నర ఇస్తానని ఒప్పుకున్నట్లు మంచు విష్ణు చెబుతున్న విషయం లో వాస్తవం లేదని, అసలు ఓటర్ సినిమాకు కధ,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ చేస్తే నాకు వచ్చింది 20 లక్షలే అని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనితో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది.

పాపం చాలా రోజుల గ్యాప్ తరువాత మంచు విష్ణు మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తుండగా ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఈ చిత్రం ఏమౌతుందో చూడాలి.